గాండియర్‌గా వర్ణ చిత్రం | Anushka's 'Varna' Getting Record Release on 22nd November | Sakshi
Sakshi News home page

గాండియర్‌గా వర్ణ చిత్రం

Nov 14 2013 12:31 AM | Updated on Sep 2 2017 12:34 AM

గాండియర్‌గా వర్ణ చిత్రం

గాండియర్‌గా వర్ణ చిత్రం

అనుష్క, ఆర్యలాంటి తారలు... 60 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయం... జార్జియా, ఉటాప్, ఉజ్బెకిస్తాన్, ఇండియాలోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ

 అనుష్క, ఆర్యలాంటి తారలు... 60 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయం... జార్జియా, ఉటాప్, ఉజ్బెకిస్తాన్, ఇండియాలోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ... గ్రాండియర్ గ్రాఫిక్స్... హాలీవుడ్ చిత్రాల రీరికార్డింగ్ జరిగే బుడాపెస్ట్‌లో నేపథ్య సంగీత కార్యక్రమాలు... వీటన్నిటితో ‘వర్ణ’ చిత్రం ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేసి ఓ కొత్తలోకాలకు తీసుకువెళ్తుందంటున్నారు నిర్మాత ప్రసాద్.వి. పొట్లూరి. శ్రీ రాఘవ దర్శకత్వంలో పి.వి.పి. సినిమా పతాకంపై రూపొందిన ‘వర్ణ’ చిత్రం ఈ నెల 22న 1200 థియేటర్లలో విడుదల కానుంది. 
 
 ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం అవుట్‌పుట్ చూసి మా హీరో ఆర్య మలేసియా, సింగపూర్ పంపిణీ హక్కులు తీసుకున్నారు. అలాగే హిందీ రీమేక్ హక్కులను డిస్నీ-యూటీవీ సంస్థ హస్తగతం చేసుకుంది. నార్త్ ఇండియా పంపిణీ హక్కుల్ని ఫాక్స్ స్టార్ సంస్థ చేజిక్కించుకుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జైరాజ్, సమర్పణ: పరమ్.వి.పొట్లూరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement