breaking news
Varna
-
''వర్ణ'' స్టార్స్ అనుష్క, ఆర్యలతో చిట్‌చాట్
-
వర్ణన
-
సినిమా రివ్యూ: వి'వర్ణ'
సుమారు 60 కోట్ల వ్యయంతో తమిళంలో రూపొందిన 'ఇరందామ్ ఉల్గమ్' చిత్రం తెలుగులో 'వర్ణ'గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్క శెట్టి, ఆర్య జంటగా శ్రీరాఘవ దర్శకత్వంలో పీవీపీ బ్యానర్ పై పొట్లూరి వి ప్రసాద్ వర్ణ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ ప్రారంభానికి ముందే అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. ఎట్టకేలకు చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసుకుని 'వర్ణ'గా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకునేందుకు ఓ సారి కథలోకి వెళ్తాం. ఎవరిని ప్రేమించాం, ఎందుకు, ఎలా, ఎన్నాళ్లు ప్రేమించామనేది ముఖ్యం కాదు. ప్రేమిస్తున్నామా అనేదే ముఖ్యమనే పాయింట్ గా 'వర్ణ' రూపొందింది. ఈ పాయింట్ ఆధారంగా చేసుకుని రెండు లోకాల్లో రెండు జంటల మధ్య నడిచిన ప్రేమ కథలను ఈ చిత్రంలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. మహిళను ఓ బానిసగా, విలాసవస్తువుగా చూసే ఓ కొత్త లోకంలో వర్ణ అనే ఒక బానిసను మహేంద్ర అనే యోధుడు ప్రేమిస్తుంటాడు. వర్ణ ఇష్టానికి వ్యతిరేకంగా మహేంద్ర బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. అయితే తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి జరగడంతో వర్ణ ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తుంది. ఇక మరో కథలో మధు అనే సోషల్ వర్కర్ ను రమ్య అనే డాక్టర్ ప్రేమిస్తుంది. రమ్య ప్రేమను మధు నిరాకరిస్తాడు. దాంతో రమ్య నిరాశకు లోనవుతుంది. అయితే రమ్య ప్రేమను నిరాకరించిన మధు తర్వాత అర్ధం చేసుకుని ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత రమ్యను కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుందామనుకున్న తరుణంలో రమ్య ప్రమాదంలో మరణిస్తుంది. వర్ణ ఆత్మహత్య ప్రయత్నం, రమ్య ఊహించని విధంగా మరణించడం ఇంటర్వెల్ వరకు సాగిన కథ. రెండు ప్రేమ కథలో హీరోయిన్ పాత్రలపై ఓ ట్విస్ట్ తో తొలి భాగం పూర్తి అవుతుంది. అయితే ఆత్మహత్యకు ప్రయత్నించిన వర్ణ పరిస్థితి ఏమిటి? మహేంద్ర ప్రేమను వర్ణ అంగీకరిస్తుందా? రమ్యను కోల్పోయిన మధు ఏమవుతాడు అనే ప్రశ్నలకు చిత్ర రెండవ భాగంలో సమాధానం దొరుకుతాయి. రెండు ప్రేమకథలతో ఓ కొత్తగా ప్రజెంట్ చేద్దామనే శ్రీరాఘవ ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పవచ్చు. రెండు లవ్ ట్రాక్స్ తో ప్రేక్షకుడిని కన్ ఫ్యూజ్ చేశాడు. దర్శకుడిగా శ్రీ రాఘవ తన కథను సరియైన రీతిలో ప్రజెంట్ చేయకపోవడం ఒక వైఫల్యమైతే.. ఎవరికి అర్ధం కాని పేలవమైన కథ ఎంచుకోవడం మరో మైనస్ పాయింట్. ప్రేక్షకులు ఏ విధంగా సంతృప్తి చెందుతారు అనే ప్రశ్నను దర్శకుడు వేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారా అనే సందేహం వెంటాడుతుంది. రెండు గంటలకు పైగా సాగిన ఈ సినిమాలో రెండు నిమిషాలు కూడా ప్రేక్షకుడ్ని మెప్పించలేకపోయాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకుడికి అనుక్షణం ఓ రకమైన చిత్రహింసకు గురి చేయడమే కాకుండా, పుష్కలంగా అసహనాన్ని దర్శకుడు పంచిపెట్టారు. ఇంతకంటే ఈ చిత్రం గురించి, దర్శకుడి గురించి చెప్పడం సమయం వృధానే. ఈ చిత్రంలో వర్ణ, రమ్య అనే పాత్రల్లో అనుష్క, మధు బాలకృష్ణ, మహేంద్ర అనే రోల్స్ లో ఆర్య కనిపించారు. విసిగెత్తించే కథలో అనుష్క, ఆర్యలు చేయాల్సిందేమి లేకపోయింది. అనుష్క, ఆర్యలు జంటగా మరో చిత్రంలో నటించారని చెప్పుకోవడానికే తప్ప వీరిద్దరికి ఏమాత్రం ఉపయోగపడదు. యోధుడిగా ఆర్య సిక్స్ ప్యాక్ కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలింది. ఈ నాలుగు పాత్రలు తప్ప వర్ణలో రిజిస్టర్ అయ్యే మరో పాత్ర కనిపించదు. అందమైన లోకేషన్లు, రాంజీ కెమెరా పనితనం బాగున్నాయి. హరీస్ జైరాజ్ సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. అనిరుధ్ రవిచంద్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ పర్వాలేదనిపించింది. కథలోనే లొసుగులు ఉండటంతో టెక్నిషియన్ల ప్రతిభ కూడా మరుగున పోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. భారీ బడ్జెట్ తో తలా తోకా లేకుండా రూపొందిన వర్ణ నిరాశపరిచించింది. రెండు కథలతో రెండు లోకాలను చూపించిన దర్శకుడు.. ప్రేక్షకుడికి నరకం లాంటి మరో లోకాన్ని వర్ణ ద్వారా చూపించాడు. -
''వర్ణ''వెండితెర విజువల్ వండర్
-
నా కల నెరవేరింది!
ఈ జనరేషన్లో మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ అంటే అనుష్క పేరే చెప్పాలి. కొన్ని కొన్ని హైఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ కేరెక్టర్స్ విషయంలో డెరైక్టర్స్‌కి ఫస్ట్ చాయిస్ అండ్ బెస్ట్ చాయిస్ ఆమె. 2013 వత్సరం... ఆమె కెరీర్లో చాలా కీలకమైనది. ఈ ఏడాది మొదలైన మూడు భారీ ప్రాజెక్ట్స్‌లో ఆమె ముఖ్య తార. ఆ జాబితాలో మొదటిది ‘వర్ణ’. ఆర్య, అనుష్క జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సినిమాపై అనుష్క భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అనుష్కతో ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. వర్ణ.. రుద్రమదేవి.. బాహుబలి... ఈ మూడూ మెగా ప్రాజెక్టులే. ఒకేసారి ఈ మూడు సినిమాలు చేయడం ఎలా అనిపిస్తోంది? ముందుగా నిర్మాత శ్యామ్ప్రసాద్రెడ్డిగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నన్ను ‘అరుంధతి’కి ఎంపిక చేసినప్పుడు, నేను రెండే రెండు సినిమాలు చేశాను. పైగా, వాటిలో నావి గ్లామర్ రోల్స్. కానీ, ఓ నమ్మకంతో ‘అరుంధతి’కి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా నేనేంటో ప్రూవ్ చేసింది. దాంతో, అనుష్కకు నటనకు అవకాశం ఉన్న రోల్స్ ఇవ్వొచ్చని, శక్తిమంతమైన పాత్రలకు కూడా పనికొస్తాననే అభిప్రాయం చాలామందికి ఏర్పడింది. అందుకే, ఇలా మెగా ప్రాజెక్ట్స్‌కి అవకాశం వచ్చింది. ఈ మూడు కూడా అద్భుతమైన అవకాశాలు. బాధ్యతను పెంచిన చిత్రాలు కూడా. ఈ మూడు చిత్రాల్లో ఏది కష్టం? అలా చెప్పలేం. ఏ సినిమా కష్టం దానిదే. కాకపోతే, ‘వర్ణ’తో పోల్చితే ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో ఫైట్స్ ఎక్కువ. ‘వర్ణ’లో నేను పోరాట యోధురాల్ని కాదు. సందర్భానుసారం కొన్ని ఫైట్స్ చేశాను. ఆర్య వారియర్ కాబట్టి, తనకు రిస్కీ ఫైట్స్ ఉన్నాయి. ఈ సినిమాకి మీరే హీరో అని ఆర్య అంటున్నారు..? సినిమాలో నేనూ కొన్ని ఫైట్స్ చేశాను కాబట్టి అలా అని ఉంటారు. కానీ, ఆర్య చేసిన పాత్రలు కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. నేను దేవుణ్ణి, వాడు-వీడు చిత్రాల్లో తను ఎంత అద్భుతంగా నటించారో తెలిసిందే. ఈ సినిమాలో కూడా నటనపరంగా ఆర్య విజృంభించారు. ‘వర్ణ’ అంటే ఏంటి.. ఇందులో మీరు రెండు పాత్రలు చేశారా? ఈ సినిమాలో నేను రెండు పాత్రల్లో కనిపిస్తాను. ఒక పాత్ర పేరు వర్ణ. సాదాసీదా అమ్మాయి. ఇంకోటి డాక్టర్ కేరక్టర్. ఒక పాత్ర సీరియస్‌గా, ఇంకోటి అమాయకంగా ఉంటుంది. రెండు భిన్నమైన పాత్రల్లో వ్యత్యాసం చూపించడానికి శాయశక్తులా కృషి చేశాను. సో.. ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందన్నమాట.. అదేం లేదు. రెండు విభిన్న ప్రపంచాలలో జరిగే కథ అనుకోవచ్చు. ఓ టిపికల్ లవ్‌స్టోరీతో తీసిన సినిమా. ప్రేమ కోసం ఎంతవరకూ వెళతామో సినిమా చూస్తే తెలుస్తుంది. నేటి తరానికి తగ్గ కథతోనే సినిమా ఉంటుంది. కథలో కొంచెం ఆధ్యాత్మికత కూడా ఉంటుంది. సెల్వరాఘవన్ అంటే.. రెండు, మూడేళ్లు సినిమా తీస్తారనే అభిప్రాయం ఉంది. ఈ సినిమా ఒప్పుకునేటప్పుడు మీకా ఆలోచన రాలేదా? ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కథ. కొన్ని కథలు వదులుకుంటే భవిష్యత్తులో మళ్లీ రాకపోవచ్చు. ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి సినిమా చేయాలనే నా కల ‘వర్ణ’తో నెరవేరింది. ‘వర్ణ’ అంగీకరించడానికి మరో కారణం సెల్వరాఘవన్. తనో అద్భుతమైన దర్శకుడు. అది అందరికీ తెలిసిన విషయం. కానీ, తెలియని విషయం ఏంటంటే, ఆయన ఎక్స్ట్రార్డనరీ పెర్ఫార్మర్. లొకేషన్లో ప్రతి సీన్ యాక్ట్ చేసి, చూపించేవారు. అలాగే, సీన్ చెప్పగానే ‘ఇలా తీస్తారేమో’ అని ఊహించుకునేదాన్ని. కానీ, అందుకు భిన్నంగా ఆయన టేకింగ్ ఉండేది. ఈ సినిమా చేయడంవల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక, సినిమా ఆలస్యం అయ్యిందంటే దానికి నేను, ఆర్య కూడా ఒక కారణమే. మేం మిగతా సినిమాలు చేయడంవల్ల డేట్స్ విషయలో కొంచెం ఇబ్బంది ఏర్పడింది. ఓ నటిగానే కాదు.. ఓ ప్రేక్షకురాలిగా కూడా ఇలాంటి సినిమా చూడ్డానికి ఇష్టపడతాను. చిత్ర నిర్మాతల గురించి? సినిమా మీద ఎంతో పేషన్ ఉన్నవాళ్లే ‘వర్ణ’లాంటివి తీయగలుగుతారు. ప్రసాద్‌గారు, వినయ్‌గారు కథని నమ్మి ఈ సినిమా నిర్మించారు. ఏ విషయంలోనూ రాజీపడలేదు. ఈ సినిమాకి వాళ్లు నిర్మాతలు కాబట్టే.. న్యాయం జరిగింది. ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే కథతో రూపొందిన చిత్రం ‘వర్ణ’ అన్నారు. మరి.. మీరు ప్రేమలో పడితే, దానికోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి ట్రై చేస్తారా? అంత అవసరం రాదేమో అనుకుంటున్నా. ఎందుకంటే, నేను ప్రేమలో పడితే హ్యాపీగా పెళ్లి చేసుకుంటా. నా లవ్‌స్టోరీకి ఎలాంటి ఇబ్బందులు రావనుకుంటున్నా. అయితే మీది గ్యారంటీగా లవ్ మ్యారేజే అన్నమాట... ఏదీ ముందే చెప్పలేం. నచ్చిన వ్యక్తి తారసపడితే ప్రేమ వివాహం చేసుకుంటా. లేకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటా. అంటే.. ఇప్పటివరకూ ప్రేమలో పడలేదా? ఇప్పటికి పడలేదు. భవిష్యత్తులో పడతానేమో తెలియదు. అసలు ఎప్పుడో జరగబోయేవాటి గురించి ఇప్పుడే ఎలా ఊహించగలుగుతాం. అసలు పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? సదభిప్రాయమే ఉంది. -
ఆర్య, అనుష్కల 'వర్ణ' చిత్రాలు
ఆర్య, అనుష్క హీరోయిన్లుగా నటించిన ఇండియన్ రొమాంటిక్ ఫాంటసీ చిత్రం 'వర్ణ'కు దర్శకుడు సెల్వ రాఘవన్. తమిళంలో ఇరందమ్ ఉల్గమ్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. -
ఎముకలు కొరికే చలిలో...
నిర్మాతల శ్రేయస్సును కోరే కథానాయికలు ప్రస్తుతం అరుదైపోయారనే చెప్పాలి. సౌకర్యాల విషయంలో.. ఏ మాత్రం రాజీ పడకుండా నిర్మాతలకు చుక్కలు చూపించడంలో నేటి కథానాయికలు దిట్టలు. ఒకప్పుడు సౌందర్య నిర్మాతల పాలిటి కల్పతరువుగా వెలిగారు. తాను కోరడమే ఆలస్యం... అయిదు నక్షత్రాల హోటళ్లలో సూట్ తీయడానిక్కూడా వెనుకాడని నిర్మాతలున్న రోజుల్లోనే... హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రశాంత్ కుటీర్ అనే చిన్న గెస్ట్‌హౌస్‌లో బస చేసేవారు సౌందర్య. పారితోషికం విషయం కాని, సౌకర్యాల విషయంలో కాని, చివరకు కాస్ట్యూమ్స్ కొనుగోళ్ల విషయంలో కూడా ఆమె చాలా ఉదారంగా ప్రవర్తించేవారట. నిర్మాత కష్టాలు పడకుండా, నష్టపోకుండా చూసుకునేవారట. కానీ ప్రస్తుత కథానాయికలు అందుకు పూర్తి విరుద్ధం. వాళ్లకు నిర్మాతల్ని కష్టపెట్టడమే పని. అయితే... అలాంటి కథానాయికల లిస్ట్‌లో నుంచి అనుష్కను మాత్రం మినహాయించాలి. నిర్మాతల క్షేమాన్ని కాంక్షించే విషయంలో సౌందర్యను తలపిస్తున్నారట అనుష్క. గతంలో చాలామంది నిర్మాతలు ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచినా... ‘వర్ణ’ నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి ఇటీవల ఈ విషయాన్ని ధృఢపరిచారు. ‘‘జార్జియాలో ఎముకలు కొరికే చలిలో ‘వర్ణ’ షూటింగ్ చేశాం. ఆ చలిలో అనుష్క అందించిన సహకారం మరిచిపోలేను. ప్రత్యేకమైన సౌకర్యాలేం ఆశించకుండా, దాదాపు వారం రోజుల పాటు ఆ ఎపిసోడ్‌ని పూర్తి చేశారామె. ఈ చిత్రం బడ్జెట్ అంచనాలకు మించడంతో పారితోషికం విషయంలో కూడా ఆమె ఉదారత చూపించారు. నేటి కథానాయికల్లో నిజంగా అనుష్క ఆణిముత్యమే’’ అన్నారాయన. -
గాండియర్‌గా వర్ణ చిత్రం
అనుష్క, ఆర్యలాంటి తారలు... 60 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయం... జార్జియా, ఉటాప్, ఉజ్బెకిస్తాన్, ఇండియాలోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ... గ్రాండియర్ గ్రాఫిక్స్... హాలీవుడ్ చిత్రాల రీరికార్డింగ్ జరిగే బుడాపెస్ట్‌లో నేపథ్య సంగీత కార్యక్రమాలు... వీటన్నిటితో ‘వర్ణ’ చిత్రం ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేసి ఓ కొత్తలోకాలకు తీసుకువెళ్తుందంటున్నారు నిర్మాత ప్రసాద్.వి. పొట్లూరి. శ్రీ రాఘవ దర్శకత్వంలో పి.వి.పి. సినిమా పతాకంపై రూపొందిన ‘వర్ణ’ చిత్రం ఈ నెల 22న 1200 థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం అవుట్‌పుట్ చూసి మా హీరో ఆర్య మలేసియా, సింగపూర్ పంపిణీ హక్కులు తీసుకున్నారు. అలాగే హిందీ రీమేక్ హక్కులను డిస్నీ-యూటీవీ సంస్థ హస్తగతం చేసుకుంది. నార్త్ ఇండియా పంపిణీ హక్కుల్ని ఫాక్స్ స్టార్ సంస్థ చేజిక్కించుకుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జైరాజ్, సమర్పణ: పరమ్.వి.పొట్లూరి. -
ఇకపై కత్తి పట్టను: అనుష్క
‘‘భవిష్యత్తులో కూడా చాలా గర్వంగా చెప్పుకునే సినిమా ‘వర్ణ. చాలా మంచి ప్రేమ కథ ఇది. వర్ణ, బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు పూర్తయ్యాక హీరోలతో డ్యాన్సులు చేసే సినిమాలు చేయాలనుంది. ఇకపై కత్తిపట్టను’’ అని అనుష్క చెప్పారు. ఆర్య, అనుష్క జంటగా శ్రీ రాఘవ దర్శకత్వంలో పి.వి.పి. పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ‘వర్ణ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. రఘురామరాజు పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీ రాఘవకు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ -‘‘రాబోయే రోజుల్లో హాలివుడ్ స్థాయి సినిమాలూ మనమూ తీయగలం. అందుకు ‘వర్ణ’ ఓ ప్రారంభం మాత్రమే. ఆర్య, అనుష్క, శ్రీ రాఘవ లేకపోతే ‘వర్ణ’ అనే రంగుల ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించలేకపోయేవాళ్లం. రెండేళ్లు కష్టపడి దేశ విదేశాలు తిరిగి ఈ సినిమా చేశాం’’ అని తెలిపారు. శ్రీ రాఘవ మాట్లాడుతూ -‘‘‘అవతార్’ గొప్ప సినిమా అని మనం ప్రతిసారి మాట్లాడుకోనవసరం లేదు. ఇక్కడ కూడా రాజమౌళిలాంటి దర్శకులు ఎందరో ఉన్నారు. రాబోయే 10, 15 ఏళ్లలో ‘అవతార్’లాంటి సినిమాలు మనమూ తీయగలం’’ అని చెప్పారు. ‘కొలవరి డి’ ఫేమ్ అనిరుథ్ నేతృత్వంలో హాలీవుడ్లో ఫేమస్ రికార్డింగ్ స్టూడియో బుడాపెస్ట్‌లో రీరికార్డింగ్ జరుగుతోందని సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్య, భోగవల్లి ప్రసాద్, దానయ్య, సి.కల్యాణ్, ‘దిల్’రాజు, శరత్ మరార్, బండ్ల గణేష్, దశరథ్, వంశీ పైడిపల్లి, మారుతి, శ్రీకాంత్ అడ్డాల, గుణ్ణం గంగరాజు, చంద్రబోస్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. -
వర్ణ సినిమా ఆడియో
ఆర్య, అనుష్క హీరోయిన్లుగా నటించిన ఇండియన్ రొమాంటిక్ ఫాంటసీ చిత్రం 'వర్ణ'కు దర్శకుడు సెల్వ రాఘవన్. తమిళంలో ఇరందమ్ ఉల్గమ్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. వర్ణ చిత్ర ఆడియోను హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో 27 తేది ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రాన్ని 70 కోట్ల భారీ వ్యయంతో పీవీపీ సినిమా పతాకంపై పరం వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ముందెన్నడూ లేని విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం తెరక్కెతోందని సమాచారం. పలు విజయవంతమైన హాలీవుడ్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన కేత్ డెలివిన్ సంస్థ ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం.