స్పానిష్‌ సినిమా రీమేక్‌లో స్వీటీ | Anushka Shetty To Remake Spanish Film Julias Eyes | Sakshi
Sakshi News home page

స్పానిష్‌ సినిమా రీమేక్‌లో స్వీటీ

Jun 5 2019 1:15 PM | Updated on Jun 5 2019 1:15 PM

Anushka Shetty To Remake Spanish Film Julias Eyes - Sakshi

సౌత్‌ స్టార్ హీరోయిన్‌ అనుష్క శెట్టి వరుస సినిమాలకు రెడీ అవుతున్నారు. సైజ్‌ జీరో సినిమా కారణంగా లుక్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ తరువాత సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చారు. ఇటీవల బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న సైలెన్స్‌ సినిమాను ప్రారంభించిన అనుష్క, తదుపరి చేయబోయే సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది.

స్పానిష్‌ థ్రిల్లర్‌ ‘జూలియాస్‌ ఐస్‌’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేసేందుకు అనుష్క ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. తన సోదరి మరణం వెనుక రహస్యాన్ని చేధించేందకు ఓ యువతి చేసిన సాహసాలే ఈ సినిమా కథ. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్‌ లాల్‌ దర్శకుడిగా మారనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement