‘సైరా’లో అనుష్క పాత్ర ఇదేనా!

Anushka plays Rani Laxmi Bai in Sye Raa Narasimha Reddy - Sakshi

మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అనుష్క చేస్తున్న పాత్ర విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో అనుష్క, ఝాన్సీ లక్ష్మీ బాయ్ పాత్రలో కనిపించనున్నారట. గతంలో రుద్రమదేవిగా అలరించిన అనుష్క ఇప్పుడు మరో చారిత్రక పాత్రలో ఆకట్టుకునేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే చిత్రయూనిట్ మాత్రం అనుష్క పాత్రపై ఎలాంటి ప్రటనా చేయలేదు.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్‌2న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సుధీప్‌, జగపతి బాబు, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top