కృష్ణమ్మ పాత్రలో అనుష్క | Anushka as Krishnamma in Om Namo Venkatesaya | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ పాత్రలో అనుష్క

Aug 6 2016 12:28 PM | Updated on Sep 4 2017 8:09 AM

కృష్ణమ్మ పాత్రలో అనుష్క

కృష్ణమ్మ పాత్రలో అనుష్క

అన్నమయ్య, రామదాసు, శిరిడి సాయి లాంటి సినిమాలతో అలరించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఓం నమో వేంకటేశాయా. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా...

అన్నమయ్య, రామదాసు, శిరిడి సాయి లాంటి సినిమాలతో అలరించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఓం నమో వేంకటేశాయా. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశారు చిత్రయూనిట్. ఇప్పటికే టైటిల్ లోగో, నాగార్జున లుక్తో పాటు ఏడు కొండలవాడిగా కనిపిస్తున్న ఉత్తరాధి నటుడు సౌరబ్ జైన్ లుక్ను కూడా రిలీజ్ చేశారు.

చాలా రోజులుగా ఈ సినిమాలో అనుష్క ఓ సన్యాసి పాత్రలో కనిపిస్తుందంటూ ప్రచారం జరిగింది. అయితే అనుష్క నటిస్తుందంటూ హింట్ ఇచ్చిన చిత్రయూనిట్ సన్యాసి పాత్ర అని మాత్రం కన్ఫామ్ చేయలేదు. తాజాగా ఓం నమో వేంకటేశాయా సినిమాలో అనుష్క ఎలా ఉండబోతుందో ప్రేక్షకులకు చూపించారు. కృష్ణమ్మ పాత్రలో కనిపిస్తున్న అనుష్క లుక్ను శనివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు.

తొలి సారిగా అనుష్క ఓ భక్తిరస చిత్రంలో నటిస్తుండంతో పాటు హిట్ కాంబినేషన్గా పేరున్న నాగార్జున సినిమా కావటం, గతంలో రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన భక్తిరస చిత్రాలన్ని ఘనవిజయం సాధించంటంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement