మన్మోహన్‌ వస్తున్నారు | Anupam Kher is the spitting image of Dr Manmohan Singh in first look from The Accidental Prime Minister | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌ వస్తున్నారు

Apr 6 2018 12:31 AM | Updated on Apr 6 2018 12:31 AM

Anupam Kher is the spitting image of Dr Manmohan Singh in first look from The Accidental Prime Minister - Sakshi

అనుపమ్‌ ఖేర్‌

దేశ ప్రధానమంత్రిగా 2004 నుంచి 2014 వరకు బాధ్యతలు నిర్వర్తించారు డా. మన్మోహన్‌సింగ్‌. ఈ పదేళ్లలో ఆయనను కొందరు ప్రశంసించారు. మరికొందరు విమర్శించారు. పదవీకాలం ముగిసిపోయే సమయంలో  ఆయన జీవితంపై ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అనే పుస్తకం విడుదల అయ్యింది. 2004 మే నుంచి 2008 ఆగస్టు వరకు మన్మోహన్‌సింగ్‌కు మీడియా అడ్వైజర్‌గా వర్క్‌ చేసిన సంజయ్‌బారు ఈ పుస్తకం రాయడం విశేషం. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్‌లో రూపొందుతున్న సినిమా‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’. విజయ్‌ గుట్టే దర్శకత్వం వహిస్తున్నారు.

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ నటిస్తున్నారు. బోహ్రా బోస్‌ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌ లుక్స్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘సినిమాలో డా. మన్మోహన్‌ సింగ్‌ లుక్‌ని షేర్‌ చేయడం హ్యాపీగా ఉంది’’ అని అనుపమ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 21న చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. మరోవైపు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కాశర్మ ముఖ్య తారలుగా నటిస్తున్న ‘జీరో’ చిత్రాన్ని ఇదే రోజున రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. సో.. బాక్సాఫీస్‌ వద్ద క్లాష్‌ తప్పదన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement