‘ఒక్క రూపాయి తీసుకోకుండా నటించారు’ | Anthervedam Movie Audio Release | Sakshi
Sakshi News home page

Jul 14 2018 4:28 PM | Updated on Jul 14 2018 4:28 PM

Anthervedam Movie Audio Release - Sakshi

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన విభిన్న చిత్రం అంతర్వేదమ్. చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా ఆడియోను సినీ ప్రముఖల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. నిర్మాత రాజ్‌ కందుకూరి ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని నటుడు తనికెళ్ల భరణికి అందించారు. 

ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్రలో నటించిన తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ‘ఈమధ్యకాలంలో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వేరే రంగాల్లో విజయ కేతనం ఎగురవేస్తున్నప్పటికీ.. మానసిక సంతృప్తి కోసం సినిమా రంగంలోకి వస్తున్నారు. మంచి విజయం సాధిస్తున్నారు. యువత ఏదో పిచ్చి వేషాలు వేస్తున్నారు అంటున్నారు కానీ.. అంతర్వేదం సినిమాలో నటించినవారు కానీ.. యూనిట్ మెంబర్స్ కానీ అందరూ కొత్తవారే, సినిమా పట్ల వాళ్ళ ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది’ అన్నారు.

ముఖ్య అతిధిగా హాజరైన రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘యూనిట్ మొత్తంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న వాళ్ళందరూ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకొంటున్నాను’ అన్నారు. దర్శకుడు చందిన రవికిషోర్  మాట్లాడుతూ.. ‘నేను చెప్పిన కథ నచ్చి తనికెళ్ళ భరణి గారు ముందు కోఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఫ్రీగా ఇప్పటివరకూ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా వర్క్ చేశారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన అతిధులందరికీ పేరుపేరునా కృతజ్ణతలు తెలియజేసుకొంటున్నాను‘ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement