మరో చిత్రానికి ఓకే | Another film is okay | Sakshi
Sakshi News home page

మరో చిత్రానికి ఓకే

Nov 28 2014 2:37 AM | Updated on Aug 17 2018 2:27 PM

మరో చిత్రానికి ఓకే - Sakshi

మరో చిత్రానికి ఓకే

నటుడు అజిత్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఈయన నటించిన తాజా చిత్రం ఎన్నైఅరిందాల్.

నటుడు అజిత్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఈయన నటించిన తాజా చిత్రం ఎన్నైఅరిందాల్. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క, త్రిష, పార్వతిమీనన్ హీరోయిన్లు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రాన్ని జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అజిత్ తరువాత శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. వీరి కలయికలో ఇంతకుముందు వీరం వంటి విజ యవంతమైన చిత్రం తెరకెక్కిందన్నది గమనార్హం.

ఈ చిత్రం తరువాత మరో చిత్రానికి కూడా అజిత్ పచ్చజెండా ఊపారు. ఇంతకుముందు బిల్లా వంటి స్టైలిష్ చిత్రాన్ని, ఆరంభం వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అజిత్ హీరోగా రూపొందించిన యువ దర్శకుడు విష్ణువర్దన్ ముచ్చటగా మూడవసారి అజిత్‌తో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్ర విషయమై దర్శకుడు విష్ణువర్దన్ ఇటీవల అజిత్‌ను కలిసి చర్చించినట్టు తెలిసింది. విష్ణువర్దన్ ప్రస్తుతం ఆర్య, కృష హీరోలుగా యట్చన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపా సన్నిధి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి పూర్తి చేసిన తరువాత అజిత్ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement