కలైంజియం చిత్రం చెయ్యను | Anjali returns to Tamil cinema, teams up with Jayam Ravi | Sakshi
Sakshi News home page

కలైంజియం చిత్రం చెయ్యను

Jul 3 2014 11:10 PM | Updated on Sep 2 2017 9:46 AM

కలైంజియం చిత్రం చెయ్యను

కలైంజియం చిత్రం చెయ్యను

దర్శకుడు కలైంజియం చిత్రంలో నటించనని అంజలి ఖరాఖండిగా చెప్పారు. రెండేళ్ల క్రితం పిన్నిపై ఆరోపణలు, దర్శకుడు కలైంజియంపై ఫిర్యాదులతో కోలీవుడ్‌లో కలకలం సృష్టించిన

దర్శకుడు కలైంజియం చిత్రంలో నటించనని అంజలి ఖరాఖండిగా చెప్పారు. రెండేళ్ల క్రితం పిన్నిపై ఆరోపణలు, దర్శకుడు కలైంజియంపై ఫిర్యాదులతో కోలీవుడ్‌లో కలకలం సృష్టించిన అంజలి కోలీవుడ్‌కు దూరం అయ్యారు. తాజాగా ఈ అమ్మడు రీ ఎంట్రీ అయ్యారు. జయం రవి హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గురువారం ఉదయం చెన్నైలో ప్రారంభమైంది.
 
 ఈ చిత్రంలో పాల్గొనడానికి అంజలి హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ తమిళంలో సుమారు రెండేళ్ల తరువాత నటిస్తున్నానని తెలిపారు. దర్శకుడు సూరజ్ చెప్పిన కథ ఎంతగానో నచ్చిందన్నారు. ఈ చిత్రంలో తాను హాస్యం పండించనున్నట్లు చెప్పారు. ఇకపోతే తన గురించి చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయన్నారు. తన పెళ్లి జరిగిపోయినట్లు తానెవరి కట్టుబాటులోనో ఉన్నట్లు రకరకాల వదంతులు ప్రచారం అయ్యాయన్నారు. నిజానికి తానెవరి ఆధీనంలోను లేనని తనకు వివాహం జరగలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా తనకెలాంటి వ్యాధి లేదని వెల్లడించారు.
 
 మరో విషయం ఏమిటంటే దర్శకుడు కలైంజియం సమస్య కోర్టులో ఉందన్నారు. కాబట్టి ఆ అంశానికి సంబంధించిన ప్రశ్నలకు బదులివ్వనని పేర్కొన్నారు. ఇకపై తమిళ చిత్రాల్లో వరుసగా నటిస్తానని చెప్పారు. తనకెవరి నుంచి ఎలాంటి బెదిరింపులు రాలేదని తెలిపారు. ఇక్కడ చక్కని వాతావరణంలోనే షూటింగ్ జరుగుతోందని చెప్పారు. దర్శకుడు కలైంజియం చిత్రం ఊరు చుట్టి ప్రవరణంలో నటిస్తారా? అన్న ప్రశ్నకు నటించనని చెప్పినందుకే కదా ఇన్ని సమస్యలు ఎదురయ్యాయి అంటూ అంజలి బదులిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement