అమెరికాలో అంజలి... | Anjali In America | Sakshi
Sakshi News home page

అమెరికాలో అంజలి...

Dec 20 2014 11:21 PM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో అంజలి... - Sakshi

అమెరికాలో అంజలి...

గీతాంజలి’ చిత్రం తర్వాత తమిళంలో మూడు సినిమాలు అంగీకరించిన అంజలి తెలుగులో ఒకే ఒక్క చిత్రానికి మాత్రమే పచ్చజెండా ఊపారు.

 ‘గీతాంజలి’ చిత్రం తర్వాత తమిళంలో మూడు సినిమాలు అంగీకరించిన అంజలి తెలుగులో ఒకే ఒక్క చిత్రానికి మాత్రమే పచ్చజెండా ఊపారు. ఈ మధ్యకాలంలో తెలుగులో బోల్డన్ని కథలు విన్న అంజలికి ఈ ఒక్క కథ మాత్రమే నచ్చిందట. ‘పిల్ల జమిందారు’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమా పతాకంపై ఈ చిత్రాన్ని గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను నిర్మాత చెబుతూ -‘‘అంజలి నటిస్తున్న మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. ఓ భిన్నమైన కథాంశంతో సాగే కామెడీ థ్రిల్లర్. నవంబర్ 18న అమెరికాలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాం. జనవరి 10 వరకు అక్కడ షూటింగ్ చేసి, ఆ తర్వాత హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ మొదలుపెడతాం’’ అని చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement