'సికిందర్' ఓపెనింగ్స్ అదుర్స్! | 'Anjaan' mints Rs. 15.03 crore in two days | Sakshi
Sakshi News home page

'సికిందర్' ఓపెనింగ్స్ అదుర్స్!

Aug 17 2014 12:49 PM | Updated on Sep 2 2017 12:01 PM

'సికిందర్' ఓపెనింగ్స్ అదుర్స్!

'సికిందర్' ఓపెనింగ్స్ అదుర్స్!

సూర్య హీరోగా నటించిన తమిళ సినిమా అంజాన్(తెలుగులో సికిందర్) బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది.

చెన్నై: సూర్య హీరోగా నటించిన తమిళ సినిమా అంజాన్(తెలుగులో సికిందర్) బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రెండు రోజుల్లోనే రూ.15.03 కోట్లు వసూలు చేయడం విశేషం. అయితే ముందుగా తీసుకున్న టిక్కెట్ల కారణంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని విశ్లేషకులు తెలిపారు. అడ్వాన్స్డ్ బుకింగ్ టిక్కెట్లే సినిమాను కాపాడాయని అంటున్నారు.

స్వాతంత్ర్యదినోత్సవం రోజున విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశ కలిగించింది. తమిళనాడతో పాటు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా విడుదలయింది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటించింది.

Advertisement
 
Advertisement
Advertisement