breaking news
Anjaan Movie
-
మూడు రోజుల్లో 30 కోట్లు
మూడు రోజుల్లో రూ.30 కోట్లు వసూలు చేసి అసాధారణ రికార్డును అంజాన్ చిత్రం సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. సూర్య, సమంత జంటగా నటించిన చిత్రం అంజాన్. లింగుసామి దర్శకత్వంలో తిరుపతి బ్రదర్స్, యూటీవీ మోషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. తమిళనాడు, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఏక కాలంలో అత్యధిక థియేటర్లలో విడుదలైన అంజాన్ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, వసూళ్లను మాత్రం రికార్డు స్థాయి సాధించడం విశేషం. ఈ చిత్రం మూడు రోజుల్లోనే 30 కోట్లు వసూలు చేసిందని యూనిట్ వర్గాలు వెల్లడించారుు. తమిళం, మలయాళం భాషల్లో ఇంతకు ముందు ఏ చిత్రం సాధించనంత రికార్డు స్థాయి వసూళ్లతో అంజాన్ చరిత్ర తిరగ రాస్తుందని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. ఆరు నిమిషాల నిడివి తగ్గింపు పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిన అంజాన్ చిత్రంలోని ఆరు నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు తెలిసింది. చిత్ర రెండో భాగంలో నిడివి ఎక్కువయ్యిందనే విమర్శలు రావడంతో ఆ ఆరు నిమిషాల సన్నివేశాలను తొలగించినట్లు యూటీవీ మోషన్స్ సంస్థ ప్రతినిధి ధనుంజయన్ వెల్లడించారు. చిత్రంలో హాస్య నటుడు బ్రహ్మానందం హాస్య సన్నివేశాలున్నాయన్నారు. అవి కథకు సంబంధం లేకపోవడంతో తొలగించినట్లు ఆయన వివరించారు. అయితే తెలుగు వెర్షన్లో ఈ సన్నివేశాలు యథాతథంగా ఉంటాయని తెలిపారు. -
'సికిందర్' ఓపెనింగ్స్ అదుర్స్!
చెన్నై: సూర్య హీరోగా నటించిన తమిళ సినిమా అంజాన్(తెలుగులో సికిందర్) బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రెండు రోజుల్లోనే రూ.15.03 కోట్లు వసూలు చేయడం విశేషం. అయితే ముందుగా తీసుకున్న టిక్కెట్ల కారణంగా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని విశ్లేషకులు తెలిపారు. అడ్వాన్స్డ్ బుకింగ్ టిక్కెట్లే సినిమాను కాపాడాయని అంటున్నారు. స్వాతంత్ర్యదినోత్సవం రోజున విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశ కలిగించింది. తమిళనాడతో పాటు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా విడుదలయింది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటించింది.