ఇండియన్‌ 2కి అనిరుద్‌ స్వరాలు | Anirudh For Kamal's Indian 2 | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ 2కి అనిరుద్‌ స్వరాలు

Jun 3 2018 4:13 AM | Updated on Aug 8 2019 11:13 AM

Anirudh For Kamal's Indian 2 - Sakshi

కమల్‌హాసన్‌–శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ (‘భారతీయుడు’) సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘనవిజయం అందుకుందో తెలిసిందే. ఆ సినిమా విడుదలైన 21 ఏళ్లకు ‘ఇండియన్‌ 2’కి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌  జరుగుతోంది. ఈ చిత్రానికి ‘కొలవెరి’ ఫేమ్‌ అనిరుద్‌ రవిచంద్రన్‌ స్వరాలు అందించనున్నారని కోలీవుడ్‌ టాక్‌.

శంకర్‌ సినిమా అంటే ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తారనుకోవడం కామన్‌. ఇప్పటివరకూ శంకర్‌ తీసిన చిత్రాల్లో ‘అపరిచితుడు, నన్బన్‌’ మినహా మిగిలిన చిత్రాలన్నింటికీ రెహమానే స్వరకర్త. ‘ఇండియన్‌ 2’కి అనిరుద్‌ ఎంటర్‌ అవ్వడం హాట్‌ న్యూస్‌ అయింది. కమల్‌ హాసన్‌ ‘బిగ్‌ బాస్‌ 2’ పూర్తవగానే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుందట.

Advertisement
 
Advertisement
Advertisement