ఇర్ఫాన్‌ మరణం కలిచివేసింది : అనిల్‌ కపూర్‌

Anil Kapoor Will Always Be Thankful To Irrfan For Taking Care Of Sonam - Sakshi

ఇర్ఫాన్‌ మార్గదర్శకులు

ముంబై : విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణం పట్ల ప్రముఖ బాలీవుడ్‌  నటుడు అనిల్‌ కపూర్‌ తీవ్ర విచారం వెలిబుచ్చారు. థ్యాంక్యూ మూవీలో కలిసి పనిచేసే సందర్భంలో తన కుమార్తె సోనం కపూర్‌ను ఆయన జాగ్రత్తగా చూసుకున్నారని కొనియాడారు. ఇర్ఫాన్‌ మరణ వార్త తనను కలించివేసిందని, ఆయన విలక్షణ నటుడని, గొప్పమానవతావాది అని ప్రస్తుతించారు. తన కుమార్తె సోనంను ఆయన చూసకున్న తీరు, మార్గదర్శకంగా వ్యవహరించిన వైనం మరిచిపోలేనిదని అన్నారు.

ఇర్ఫాన్‌ ప్రతిఒక్కరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని అనిల్‌ కపూర్‌ వ్యాఖ్యానించారు. 2011లో సోనం కపూర్‌, ఇర్ఫాన్‌లు థ్యాంక్యూ మూవీ కోసం కలిసిపనిచేశారు. ఇక అనిల్‌ కపూర్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌లు స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌, డీ-డే, చాకొలెట్‌ : డీప్‌ డార్క్‌ సీక్రెట్స్‌ వంటి పలు సినిమాల్లో కలిసి నటించారు. కాగా, ఇర్ఫాన్‌ ఖాన్‌ తీవ్ర అనారోగ్యంతో ముంబై కోకిలాబెన్‌ ధీరూబాయ్‌ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

చదవండి : పోరాడే శక్తినిచ్చిన ప్రయాణం ఇది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top