డాడీ టెన్షన్‌

Anil Kapoor on Sonam and Harshvardhan's box office clash - Sakshi

జూన్‌ 1 దగ్గర పడుతున్న కొద్దీ అనిల్‌ కపూర్‌కి ఎగై్జట్‌మెంట్, టెన్షన్‌ రెండూ పెరిగిపోతున్నాయట. కారణం ఏంటంటే..  అనిల్‌ కపూర్‌ పిల్లలు సోనమ్‌ కపూర్, హర్షవర్ధన్‌ కపూర్‌ నటించిన సినిమాలు ఒకే రోజు రిలీజ్‌ కావడమే. మొదట సోనమ్‌ నటించిన ‘వీరే దీ వెడ్డింగ్‌’ రిలీజ్‌ను జూన్‌ 1న, హర్షవర్ధన్‌ సూపర్‌ హీరో మూవీ ‘బావేష్‌ జోషీ’ సినిమాను మే 25న రిలీజ్‌ చేయాలనుకున్నారు. బట్‌ సడన్‌గా ‘బావేష్‌ జోషీ’ సినిమాను జూన్‌ 1కి రిలీజ్‌ డేట్‌ చేంజ్‌ చేశారు. పిల్లల సినిమా రిలీజ్‌ అంటే సాధారణంగా ఆత్రుతగా ఉంటుంది. కానీ ఇద్దరి సినిమాలూ ఒకే రోజు రిలీజ్‌ కానుండటంతో  కొంచెం టెన్షన్‌గా కూడా ఉంది అంటున్నారు అనిల్‌.

ఈ విషయం గురించి అనిల్‌ కపూర్‌ మాట్లాడుతూ – ‘‘రిలీజ్‌ డేట్స్‌ ఎప్పుడూ యాక్టర్స్‌ చేతిలో ఉండవు. సినిమా నిర్మించిన స్టూడియోస్, డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల మీద ఆధారపడి ఉంటాయి. యాక్టర్‌గా నేనా విషయాన్ని గౌరవిస్తాను. పిల్లలిద్దరికీ ఆల్‌ ది బెస్ట్‌. అంతా మంచే జరుగుతుందని కోరుకుందాం’’ అని పేర్కొన్నారు. ‘వీరే దీ వెడ్డింగ్‌’కి అనిల్‌ కపూర్‌ మరో కూతురు రియా కపూర్‌ నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. ‘‘వీరే దీ వెడ్డింగ్‌’ రిలీజ్‌ డేట్‌ను రియా, ఏక్తా కపూర్‌ కలసి నిర్ణయించారు. నేను ఇన్వాల్వ్‌  అవ్వదలుచుకోలేదు’’ అని పేర్కొన్నారు అనిల్‌ కపూర్‌.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top