కేవలం స్కిన్‌ షో అంటే నో

Andrea says she can be naked, and more relevant than other heroines - Sakshi

‘‘మా కోసం స్ట్రాంగ్‌ ఉమెన్‌ రోల్స్‌ రాయండి. కేవలం మీ సినిమాలో డ్యాన్స్‌ నంబర్స్‌ వరకు వచ్చి గ్లామర్‌ కోసం స్కిన్‌ షో చేయడం మాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆ ‘షో’ మాకు ఆనందాన్నివ్వదు’’ అని సంచలన కామెంట్స్‌ చేశారు నటి, ప్లేబ్యాక్‌ సింగర్‌ ఆండ్రియా. ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆండ్రియా కథానాయికలకు వస్తున్న అవకాశాల గురించి స్పందిస్తూ– ‘‘ఏ హీరోయిన్‌కి అయినా ఐడెంటిటీ వచ్చేది తను ఎవరి సరసన అయితే యాక్ట్‌ చేస్తుందో ఆ హీరో వల్లే.

మనది మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీ. పెద్ద పెద్ద స్టార్స్‌ పక్కన కనిపిస్తేనే ఆ హీరోయిన్‌కు పేరొస్తుంది. మొదటి నుంచి స్ట్రాంగ్‌ రోల్స్‌ చేయాలని హీరోయిన్‌ అనుకుంటే అలా ఒప్పుకోలేరు. ఇప్పుడున్న లేడీ సూపర్‌ స్టార్స్‌ దీపికా, నయనతారలు కూడా పెద్ద పెద్ద హీరోలతో డ్యాన్స్‌లు, గ్లామరస్‌ రోల్స్‌ చేసినవాళ్లే. కానీ వాళ్లు, నాలాంటి ఇతర కథానాయికలు  ముందు నుంచీ అలాంటి పాత్రలు చేయాలి అనుకుంటున్నాం.

నేను ఇదివరకు సినిమాల్లో డ్యాన్స్‌లు చేశాను, గ్లామర్‌ పాత్రల్లో కనిపించాను. కానీ ఒక స్టార్‌ హీరోతో డ్యాన్స్‌లు చేసిన తర్వాత వచ్చే అవకాశాలు.. ఒక స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌ ఉన్న సినిమాలు చేసిన తర్వాత ఉండకపోవచ్చు. మేం గ్లామర్‌గా కనిపించగలం. అయితే జస్ట్‌ అలా వచ్చి డ్యాన్స్‌లు, స్కిన్‌ షోలు చేయమంటే ఒకానొక దశలో ‘నో’ అనేస్తాం. మాకోసం స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ క్రియేట్‌ చేయండి, మంచి పాత్రలు రాయండి’’ అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top