బిగ్‌బాస్‌: శ్యామల ఔట్‌

Anchor Syamala Eliminated In Bigg Boss 2 Telugu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సీజన్‌-2 తుది అంకానికి చేరింది. మరో మూడు వారాల్లో ఈ రియాల్టీ షోకు తెరపడునుంది. దీంతో ఫైనల్‌కు వెళ్లే ఆ ఐదుగురు ఎవరో అని ప్రేక్షకులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో 8 మంది కంటెస్టెంట్స్‌ ఉన్నారు. వీరిలో ఈ వారం శ్యామల ఎలిమినేట్‌ అయ్యారు. అయితే ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో ఉన్నఅమిత్‌ ఎలిమినేట్‌ అవుతారని అంతా భావించారు. గతవారమే అమిత్‌ ఎలిమినేట్‌ అవుతాడని అందరూ భావించగా బిగ్‌బాస్‌ నూతన్‌ నాయుడుని ఎలిమినేట్‌ చేసి పెద్ద ట్విస్ట్‌ ఇచ్చాడు.  బిగ్‌బాస్‌ కావాలనే నూతన్‌ నాయుడిని ఎలిమినేట్‌ చేశారని, ఇదొక అన్‌ఫెయిర్‌ గేమ్‌ అని కొందరు సోషల్‌ మీడియా వేదికగా బిగ్‌బాస్‌ నిర్వాహకులు, హోస్ట్‌ నానిపై మండిపడ్డారు. దీనికి హోస్ట్‌ నాని ట్వీట్‌తో ప్రేక్షకులకు సమాధానం కూడా ఇచ్చాడు. (చదవండి:ట్రోల్స్‌పై స్పందించిన నాని)

అలా బతికిపోయిన అమిత్‌ ఈ సారి ఖచ్చితంగా ఎలిమినేట్‌ అవుతారని భావించారు. కానీ మళ్లీ అతను సేవ్‌ అయిపోయాడు. రీఎంట్రీ ఇచ్చిన శ్యామల, నూతన్‌ నాయుడులా హౌస్‌ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఈ ఎలిమినేషన్‌ విషయం కూడా ఎపిసోడ్‌కు ముందే(ఆదివారం ఉదయమే) తెలిసిపోయింది. బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఈ విషయంలో ఎంత జాగ్రత్తపడ్డా ఎలిమినేట్‌ అయ్యింది ఎవరో ముందే తెలిసిపోతోంది. శ్యామలకు, అమిత్‌కు ఓట్లలో స్వల్ప తేడా వచ్చిందని ప్రచారం జరిగింది. కానీ ఓట్లపై ఎలాంటి చర్చలేకుండా శ్యామల ఎలిమినేట్‌ అయినట్లు హోస్ట్‌ నాని ప్రకటించారు. ఈ ఆదివారం ఎపిసోడ్‌లో ‘సిల్లీఫెలోస్‌’ హీరోలు అల్లరి నరేశ్‌, సునీల్‌లు హౌస్‌లో సందడి చేశారు. హౌస్‌ మేట్స్‌తో రెండు గ్రూపులుగా విడిపోయి హోస్ట్‌ నాని ఇచ్చిన ఓ గేమ్‌ ఆడుతూ నవ్వులు పూయించారు.  (చదవండి: బిగ్‌బాస్‌: కౌశల్‌ ఆర్మీ భారీ ర్యాలీ)

శ్యామల ఎలిమినేషన్‌ అందుకేనా?
గతవారం కొంచెం తెలివిగా ప్రవర్తించి నామినేషన్‌లోకి రాకుండా తప్పించుకున్న శ్యామలకు.. ఈ సారి అలాంటి అవకాశం లేకుండా పోయింది. బిగ్‌బాస్‌ పోలీస్‌- కిల్లర్‌ టాస్క్‌లో గీతామాధురి సిక్రెట్‌ టాస్క్‌కు బలై నామినేషన్‌ ప్రక్రియలోకి వచ్చిన శ్యామలపై చాలా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా బయటి వ్యవహారాలు ఇంట్లో చెప్పి.. నూతన్‌ నాయుడిని నామినేట్‌ చేసేలా చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. ఇదే విషయాన్ని నాని కూడా గత శనివారం ప్రస్తావిస్తూ మందలించాడు. ఇది చాలా మంది ప్రేక్షకులను ప్రభావితం చేసింది. ఇక హౌస్‌ను దాదాపు తమ ఆదీనంలోకి తెచ్చుకున్న కౌశల్‌ ఆర్మీ ఆమెపై అగ్రహంగా ఉండటం.. కౌశల్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియలో ఉండటం ఆమె ఎలిమినేషన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. రీఎంట్రీ అనంతరం ఆమె ప్రవర్తనలో తేడా రావడం కూడా కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు. మొత్తానికి రీఎంట్రీతో హౌస్‌ అడుగుపెట్టిన శ్యామల ఫైనల్‌ లిస్ట్‌లో ఉండకుండానే వెనుదిరిగింది. వెళ్తూ వెళ్తూ బిగ్‌బాస్‌ ఇంటికి సేవకుడిగా ఉండాలనే బిగ్‌బాంబ్‌ను రోల్‌ రైడాపై వేసింది. ఇక తన అంచనా ప్రకారం టాప్‌ రోల్‌రైడా, గీతా మాధురి, తనీశ్‌లని చెప్పింది. ఇది కౌశల్‌ ఆర్మీకి ఆగ్రహం తెప్పించింది. సోషల్‌ మీడియా వేదికగా ఆమెపై మండిపడుతున్నారు.

మరిన్ని బిగ్‌బాస్‌ ముచ్చట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top