పెళ్లి విషయంలో ఆయనే ఆదర్శం: శ్రీముఖి | anchor srimukhi commented on her marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి విషయంలో ఆయనే ఆదర్శం: శ్రీముఖి

Nov 22 2017 9:50 PM | Updated on Oct 22 2018 6:05 PM

anchor srimukhi commented on her marriage - Sakshi - Sakshi

సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో లైవ్‌కు వస్తున్నారంటే నెట్‌జన్లకు ప్రశ్నలు పుట్టలుగా తయారు చేసుకుంటారు. వారి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల మీద ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. తాజాగా బుల్లితెరమీద కామెడీ షోలతో ఆకట్టుకుంటున్న శ్రీముఖికి సైతం ఇదే పరిస్థితి తలెత్తింది. పెళ్లి ఎప్పడు చేసుకుంటారంటూ అభిమానులు ప్రశ్నలతో ముంచెత్తారు. అయితే అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఈ బుల్లితెర బ్యూటీ ఓపిగ్గా సమాధానం ఇచ్చింది.

తనకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్ధేశం లేదని తేల్చి చెప్పేసింది పటాస్‌ ఫేం శ్రీముఖి. ఇటీవల సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈసందర్భంగా చాలా మంది అభిమానులు ఒకే ప్రశ్నను పదే పదే అడిగారు. అదేంటంటే పెళ్లి ఎప్పుడు చేసుకంటావ్‌ అంటూ ప్రశ్నలు సంధించారు. దానికి శ్రీముఖి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఇప్పుడే పెళ్లా, అంత తొందరేం వచ్చిందంటూ ఎదురు ప్రశ్నించింది. పెళ్లి విషయంలో బాలీవుడ్‌ స్టార్‌, సల్మాన్‌ ఖాన్‌ ఆదర్శం అంటూ సమాధానం ఇచ్చింది. అయితే అభిమానులు మాత్రం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతుందా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

అంతేకాకుండా శ్రీముఖి చాలా అందంగా ఉంటుందంటూ అభిమానులు, నెట్‌జన్లు పొగడ్తల వర్షం కురిపించారు. యాంకరింగ్‌ అద్భుతంగా ఉంటుందంటూ కామెంట్‌ చేశారు. యాభై యేళ్ల వయసు దాటినా సల్మాన్ పెళ్లి ఆలోచన లేకుండా బతికేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పెళ్లి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు 'నా పెళ్లి గురించి మీకెందుకు అంత ఆసక్తి, నేను చేసుకుంటే ఏంటి? చేసుకోకపోతే మీకేంటి?’  అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు సల్మాన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement