గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన జబర్దస్త్‌ అనసూయ

Anchor Anasuya Bharadwaj Receives Green Challenge From Bonthu Rammohan - Sakshi

బంజారాహిల్స్‌: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ మొదలుపెట్టిన గ్రీన్‌ చాలెంజ్‌ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఇచ్చిన గ్రీన్‌ చాలెంజ్‌ను ప్రముఖ నటి, యాంకర్‌ అనసూయ స్వీకరించారు. ఈ మేరకు శనివారం కేబీఆర్‌ పార్క్‌ ముందు జీహెచ్‌ఎంసీ ఏరియాలో మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత తన కొడుకుతో పాటు యాంకర్‌ సుమ కనకాల, నటులు అడవి శేషు, ప్రియదర్శి, డైరెక్టర్‌ వంశీ పైడిపల్లిని తలా మూడు మొక్కలు నాటాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా గ్రీన్‌ చాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అనసూయ పిలుపునిచ్చారు.  
(చదవండి : మాజీ మంత్రికి క్షమాపణలు చెప్పిన అనసూయ)


 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top