మాజీ మంత్రికి క్షమాపణలు చెప్పిన అనసూయ

Anasuya Bharadwaj Apologies To Jogu Ramanna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్తుతం టాలీవుడ్‌లో సేవ్‌ నల్లమల ఫారెస్ట్‌ అని ట్రెండ్‌ అవుతోంది. హీరోలు, హీరోయిన్లు అందరూ దీనిపై స్పందిస్తున్నారు. పనిలో పనిగా అన్నట్లు అనసూయ భరద్వాజ్‌ కూడా ఓ ట్వీట్‌ చేసింది. అయితే అంతవరకు బాగానే ఉన్నా.. తనకు కరెంట్‌ అఫైర్స్‌ పట్టు లేనందున ఓ తప్పు దొర్లింది. ఆ ట్వీట్‌ను అటవీ శాఖమంత్రి జోగు రామన్న అంటూ ట్యాగ్‌ చేసింది. అయితే అది గత ప్రభుత్వంలో అన్న విషయం ఆమెకు కాస్త లేట్‌గా తెలిసి వచ్చింది.

దీంతో మరో ట్వీట్‌ను చేసింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు క్షమాపణలు తెలిపింది. తనకు కరెంట్‌ అఫైర్స్‌ మీద అంత అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పి ప్రస్తుత అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డికి ట్యాగ్‌ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సేవ్‌ నల్లమల ఫారెస్ట్‌ అనే ఉద్యమం మంచి ఊపందుకుంటోంది. నల్లమల అడవిలో యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా ఇప్పటికే విజయ్‌ దేవరకొండ, సమంతలాంటి ప్రముఖులు స్పందిస్తూ.. ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top