‘సుచరితా రెడ్డి’పై స్పందించిన అనసూయ | Anasuya Reaction On Response Over Her Character In Yatra Movie | Sakshi
Sakshi News home page

‘సుచరితా రెడ్డి’పై స్పందించిన అనసూయ

Feb 10 2019 4:40 PM | Updated on Feb 10 2019 4:57 PM

Anasuya Reaction On Response Over Her Character In Yatra Movie - Sakshi

రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటనను మరువక ముందే.. ‘యాత్ర’లో సుచరితా రెడ్డిగా మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశారు. యాత్రలో కనిపించింది కొన్ని క్షణాలే అయినా.. తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు ఆమె. యాత్ర చిత్రంలో తన పాత్రపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో.. అనసూయ తన ఆనందాన్ని అభిమానులతో పంచకున్నారు.

‘సుచరితరెడ్డి పాత్రను పోషించడం నాకు సంతోషంగా ఉంది. నాపై చూపిస్తున్న అభిమానానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆ పాత్రను నేను పోషించగలనని నాపై నమ్మకం ఉంచిన డైరెక్టర్‌ మహి వి రాఘవ, 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ధన్యవాదాలు’ అంటూ అనసూయ భరద్వాజ్ ట్వీట్‌ చేశారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘యాత్ర’ విజయవంతంగా దూసుకుపోతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement