ఎన్టీఆర్పై 'అనంత' అభిమానం | ananthapur fans costly gift to ntr | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్పై 'అనంత' అభిమానం

Oct 7 2015 9:54 AM | Updated on Sep 3 2017 10:35 AM

ఎన్టీఆర్పై 'అనంత' అభిమానం

ఎన్టీఆర్పై 'అనంత' అభిమానం

మూడు నెలల భారీ షెడ్యూల్ తరువాత ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న ఎన్టీఆర్ కు అభిమానులు భారీ గిఫ్ట్ ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి వచ్చిన నందమూరి అభిమానులు, ఎన్టీఆర్...

మూడు నెలల భారీ షెడ్యూల్ తరువాత ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న ఎన్టీఆర్కు అభిమానులు భారీ గిఫ్ట్ ఇచ్చారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి వచ్చిన నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా బంగారు జరీతో నేసిన పట్టు వస్త్రాన్ని ఎన్టీఆర్కు అందజేశారు.

ఈ పట్టు చీరలో మరో విశేషం కూడా ఉంది. ఈ వస్త్రం పై నందమూరి తారాక రామారావు, బసవతారకంల చిత్రపటాలు వచ్చే విధంగా నేసిని బంగారు జరీ చీర ఇది. ఈ చీర కోసం 35 లక్షలకు పైగా ఖర్చు చేసినట్టుగా అభిమానులు తెలిపారు. తన పై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్,  ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో అలరించనున్నాడు. లండన్లో జరిగిన భారీ షెడ్యూల్ తరువాత బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ ఈ నెల 24 నుంచి స్పెయిన్లో మరో షెడ్యూల్కు రెడీ అవుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement