మంచి ప్రయత్నం | Anaganaga Oka Chitram Movie Teaser Launched | Sakshi
Sakshi News home page

మంచి ప్రయత్నం

May 6 2015 12:16 AM | Updated on Sep 3 2017 1:29 AM

మంచి ప్రయత్నం

మంచి ప్రయత్నం

ఈ సినిమా టీజర్‌ను చూస్తుంటే కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దాసరి నారాయణరావు అన్నారు.

‘‘ఈ సినిమా టీజర్‌ను చూస్తుంటే కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని  దాసరి నారాయణరావు అన్నారు. శివ, మేఘశ్రీ జంటగా  కొడాలి సుబ్బారావు, జె.ప్రభాకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’. జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో దాసరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘తక్కువ రోజుల్లో, లోబడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించడం మంచి ప్రయత్నం. మా తారకప్రభు ఫిలిమ్స్ పతాకంపై జె.ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో శివ, మేఘశ్రీ, జె. ప్రభాకర్‌రెడ్డి, శాఖమూరి మల్లికార్జున రావు, నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement