ఆయన బతికుంటే నా లైఫ్‌ మారిపోయేది: నటి హేమ ఎమోషనల్ | Actress Hema Visited Dasari Narayana Rao Ghat On His Death Anniversary, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Hema: ఆయన బతికుంటే నా లైఫ్‌ ఇలా ఉండేది కాదు: నటి హేమ ఎమోషనల్

May 31 2026 3:06 PM | Updated on May 31 2026 4:35 PM

Actress Hema Visited Dasari Narayana Rao Ghat on His death anniversary

దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి దుస్థితిని చూసి అందరూ షాకయ్యారు. ముళ్లకంపలతో నిండి ఉన్న ఆ సమాధి వద్ద శుభ్రం చేసేందుకు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ముందుకొచ్చారు. ఓ యాంకర్ పోస్ట్ చేసిన వీడియో చూసిన వెంటనే తన టీమ్‌తో కలిసి చెవేళ్లకు చేరుకుని క్లీనింగ్ చేపట్టారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఆ తర్వాత పలువురు టాలీవుడ్ ప్రముఖులు సైతం దాసరిని గుర్తు చేసుకున్నారు. 

మే 30న దాసరి వర్ధంతి కావడంతో నటి హేమ సైతం నివాళులర్పించారు. ఆ వీడియో చూసి నాకు చాలా బాధ కలిగిందన్నారు. ఈ రోజు గురువుగారి వర్ధంతి అని నా మైండ్‌లో కూడా లేదని తెలిపింది. కానీ ఆ వీడియో చూసి మరో నలుగురిని పోగేసుకుని ఇక్కడికి వచ్చానని తెలిపారు. మా గురువు గారు మా చేతనే ఆయన సమాధిని శుభ్రం చేయించుకున్నారు.

మా గురువు గారే బతికి ఉంటే నా లైఫ్‌ మరోలా ఉండేదని హేమ ఎమోషనలయ్యారు. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు నా మీద ఉంటాయని హేమ ఆనందం వ్యక్తం చేశారు. గురువు గారే నన్ను మర్చిపోయారా అని.. మమ్మల్ని పిలిపించుకున్నట్లు అనిపించిందని తెలిపారు. ఈ రోజు నుంచే నేను సినిమాల్లో బిజీగా ఉండాలని.. గొప్ప రాజకీయ నాయకురాలిని అవ్వాలని నన్ను ఆశీర్వదించాలని దాసరిని కోరుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement