'ఆ బాధ జీవితాంతం గుర్తుంటుంది..' మోహన్ బాబు ఎమోషనల్ స్పీచ్ | Mohan babu Emotional Comments at Dasari Narayanarao Birth anniversary | Sakshi
Sakshi News home page

Mohan babu: 'తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయా'.. మోహన్ బాబు ఎమోషనల్

May 5 2026 4:13 PM | Updated on May 5 2026 4:18 PM

Mohan babu Emotional Comments at Dasari Narayanarao Birth anniversary

టాలీవుడ్ నటుడు, హీరో మోహన్ బాబు ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఇటీవలే మోహన్ బాబు క్యారెక్టర్‌ సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో మోహన్ బాబు లుక్ అదిరిపోయింది. దాదాపు 32 ఏళ్ల తర్వాత విలన్ పాత్రలో కనిపించనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా సంగతి పక్కనపెడితే మోహన్ బాబు డైరెక్టర్స్‌ డే 2026 ఈవెంట్‌కు హాజరయ్యారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాసరి నారాయణరావును తలచుకుని ఎమోషనలయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆయన బర్త్‌ డేను మనం సెలబ్రేట్ చేసుకున్నప్పటీకీ.. చాలా బాధకరమైన రోజేనని అన్నారు. తండ్రి లాంటి వ్యక్తిని నేను కోల్పోయాననే బాధ నాకు జీవితమంతా ఉంటుందని తెలిపారు. ఎక్కడో ఉన్న నన్ను ఇండస్ట్రీకి తీసుకువచ్చి మోహన్‌బాబుగా ఈ స్థాయికి తీసుకొచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ జనరేషన్‌ వాళ్లకు చాలామందికి డైరెక్టర్‌ అనే పదానికి అర్థం తెలియదు.. దర్శకుడు అనే పదానికి సరైన అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావుగారే అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement