‘ఈ చంద్రుడికి ఇప్పుడు నాలుగు నెలలు నిండాయి’

Amy Jackson Shares Her Son Adorable Black And White Photo - Sakshi

నటి అమీ జాక్సన్‌ ఇటీవల ఓ బిడ్డకు జన్మినిచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అమీ తన కొడుకు ఆండ్రియాస్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. తెగ మురిసిపోతున్నారు. తన భుజాలపై సేదతీరతున్న ఆండ్రియాస్‌.. ఫొటోను తాజాగా షేర్‌ చేశారు. ఇందులో అమీ సోఫాపై కుర్చుని ఆండ్రియాస్‌ను తన భుజాలపై పడుకోబెట్టుకున్న బ్లాక్‌ అండ్‌ వైట్ ఫోటోకు ‘నా చంద్రుడు, నక్షత్రాలకు ఇప్పుడు నాలుగు నెలలు నిండాయి’ అనే క్యాప్షన్‌తో షేర్‌  చేస్తూ.. తన ముద్దుల తనయుడిని ముద్దుగా చంద్రుడితో పోల్చుకున్నారు.

అలాగే ‘ఈ రోజుతో నీకు నాలుగు నెలలు నిండి అయిదవ నెలలోకి అడుగుపెడుతున్నావు. నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి రోజులు ఎలా గడుస్తున్నాయో గుర్తుంచుకోవడం కష్టంగా ఉంది. ఈ భూమిపైకి వచ్చిన అద్భుతమైన చిన్న మానవుడి. నీకు అమ్మగా ఉండడాన్ని గొప్ప దీవెనగా భావిస్తున్నాను’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో అమీ అభిమానులను, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తల్లిగా అమీ మురిసిపోతున్న తీరును చూసి ఆమె అభిమానుల ఫిదా అవుతున్నారు. ‘ ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో యాండ్రి అచ్చం చంద్రుడిలా ఉన్నాడు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  

అమ్మగా అమీ.. ప్రశంసల జల్లు!

My moon and all the stars ✨❤️

A post shared by Amy Jackson (@iamamyjackson) on

కాగా.. అమీ జాక్సన్‌ ఇటీవల ఆండ్రితో కలిసి ఓ బీజ్‌లో ఆడుకుంటున్న ఫొటోలను కూడా షేర్‌ చేశారు. ఇక మోడల్‌గా నటీగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అమీ రోబో 2.0 లో కనిపించారు. ఆ తర్వాత తాను గర్భవతి కావడంతో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో ఆండ్రి‍కి జన్మనిచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top