‘మరోసారి అతనితో నటించాలని ఉంది’ | Amitabh Bachchan Said He Want to Work With Boman Irani Again | Sakshi
Sakshi News home page

బొమన్‌ ఇరానీపై ప్రశంసలు కురిపించిన సూపర్‌ స్టార్‌

Jan 25 2019 11:41 AM | Updated on Jan 25 2019 11:43 AM

Amitabh Bachchan Said He Want to Work With Boman Irani Again - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ నిర్మాతగా మారుతున్నారు. ‘ఇరానీ మూవీటోన్‌’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. బాలీవుడ్‌ సుపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఈ సంస్థ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ మాట్లాడుతూ.. ‘ఈ క్షణం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలతో ఇరానీ మూవీటోన్‌ సంస్థ విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తున్నా’నని తెలిపారు అమితాబ్‌‌. అంతేకాక ‘మరోసారి బొమన్‌ ఇరానీతో కలిసి నటించాలనుకుంటున్నాను. కానీ దేవుని దయ వల్ల ఈసారి అతను నన్ను అధిగమించకూడదని ఆశిస్తున్నాను’ అంటూ బిగ్‌ బీ చమత్కరించారు.

అమితాబ్‌, బొమన్‌ ఇరానీ నటించిన ‘వక్త్‌ : ది రేస్‌ ఎగెనెస్ట్‌ టైమ్‌’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో వీరద్దరు పండించిన కామెడీ అద్భుతం. ఈ నిర్మాణ సంస్థ గురించి బొమన్‌ ఇరానీ మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన రచయితలను గుర్తించి వారిని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement