‘పింక్‌’ కాంబినేషన్‌లో ‘బద్ల’

Amitabh Bachchan Has To Defend Taapsee Pannu Again In Badla - Sakshi

పింక్‌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ పన్నులు మరో క్రైమ్‌ థ్రిల్లర్‌తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్, అజుర్‌ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న బద్ల సినిమాలో ఈ ఇద్దరు మరోసారి కలిసి నటిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గౌరీఖాన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను బాలీవుడ్ సూపర్‌స్టార్‌ షారూఖ్‌ ఖాన్ ట్విట్టర్‌ ద్వారా రిలీజ్ చేశారు. ఈ సినిమాలోనూ అమితాబ్‌ లాయర్‌ పాత్రలోనే కనిపిస్తున్నారు. 40 ఏళ్ల కెరీర్‌లో ఒక్క కేసు కూడా ఓడిపోని లాయర్‌ బాదల్‌ గుప్తా పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ సినిమా 2016లో రిలీజ్‌ అయిన స్పానిష్ థ్రిల్లర్ ది ఇన్‌విజిబుల్ గెస్ట్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top