అబ్బే..పెద్ద గాయమేం కాదు! | Amir Khan gets injured during shooting of 'Dangal' | Sakshi
Sakshi News home page

అబ్బే..పెద్ద గాయమేం కాదు!

Nov 17 2015 12:33 AM | Updated on Sep 3 2017 12:34 PM

అబ్బే..పెద్ద గాయమేం కాదు!

అబ్బే..పెద్ద గాయమేం కాదు!

‘‘అయ్యో ఆమిర్‌ఖాన్‌కు దెబ్బ తగిలిందా... బెడ్ రెస్ట్ తీసుకోవాలా? అసలు ఆమిర్ ఇప్పుడు ఎలా ఉన్నారు?

‘‘అయ్యో ఆమిర్‌ఖాన్‌కు దెబ్బ తగిలిందా... బెడ్ రెస్ట్ తీసుకోవాలా? అసలు ఆమిర్ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎన్ని రోజులు విశ్రాంతిలో ఉండాలి?’’ అని ఆమిర్ ఖాన్ అభిమానులు, శ్రేయోభిలాషులు  ఆందోళన పడిపోయారు. ప్రస్తుతం ఆమిర్ ‘దంగల్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన మల్లయోధుడిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమిర్ బరువు కూడా పెరిగారు.

కాగా, లూధియానాలో మల్లయుద్ధానికి సంబంధించిన సీన్ తీస్తున్నప్పుడు ఆమిర్ భుజానికి గాయం అయ్యిందనే వార్త వచ్చింది. ఈ వార్త విని, ఆయన అభిమానులు కంగారుపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమిర్ గ్రహించకుండా ఉంటారా? ‘‘నాకు తగిలినది పెద్ద గాయమేం కాదు. కండరం పట్టేసింది. అంతే. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. ఆ తర్వాత షూటింగ్‌లో పాల్గొంటాను’’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారాయన.

దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి, ఆదివారం తీవ్రమైన నొప్పితో ఆమిర్ లూధియానా ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు పరిశీలించి, వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే, అదే రోజు ప్రయాణం చేయకూడదని చెప్పడంతో ఆదివారమంతా ఆమిర్ లూధియానాలోనే ఉన్నారు. సోమవారం ముంబయ్ ప్రయాణమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement