హాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూత | american Actor and director Bill Paxton is no more | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూత

Feb 26 2017 10:04 PM | Updated on Aug 17 2018 2:31 PM

హాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూత - Sakshi

హాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూత

హాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు బిల్ పాక్స్టన్(61) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

లాస్ ఏంజెలిస్: హాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు బిల్ పాక్స్టన్(61) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ది టర్మినేటర్, ఏలియన్స్, టైటానిక్ వంటి ప్రముఖ చిత్రాల ద్వారా ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న బిల్ కు డాక్టర్లు సర్జరీ చేస్తుండగానే మృతిచెందారని ఆయన సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.

ఓ మంచి భర్తగా, తండ్రిగానూ ఆయనకు మంచి పేరుంది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ద్వారా హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బిల్ పాక్స్టన్ ఆపై నటుడిగా, ఫిల్మ్ మేకర్‌గా రాణించారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు హాలీవుడ్ ఇండస్ట్రీకి విశేష సేవ చేశారని, నేడు ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని ఆయన మృతిపట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement