తీన్‌మార్‌ | Amar Akbar Anthony Pre-Release Event on November 10 | Sakshi
Sakshi News home page

తీన్‌మార్‌

Nov 6 2018 1:45 AM | Updated on Nov 6 2018 1:45 AM

Amar Akbar Anthony Pre-Release Event on November 10 - Sakshi

రవితేజ, ఇలియానా

‘ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటించిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’. ఆరేళ్ల తర్వాత ఇలియానా ఈ సినిమాతో టాలీవుడ్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు. 11ఏళ్ల కిందట వచ్చిన ‘దుబాయ్‌ శీను’ తర్వాత రవితేజ– శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ మూడు క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. సో.. ఆయన అభిమానులకు తీన్‌మార్‌ అన్నమాట.

ఈ నెల 10న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. రవితేజ మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన మా సినిమా టీజర్, మొదటి పాటకు మంచి స్పందన వచ్చింది. రెండవ పాటను దీపావళి సందర్భంగా ఈ రోజు విడుదల చేస్తున్నాం’’ అన్నారు. లయ, సునీల్, ‘వెన్నెల’ కిషోర్, రఘుబాబు, తరుణ్‌ అరోరా, అభిమన్యు సింగ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: వెంకట్‌ సి. దిలీప్, సహ నిర్మాత: ప్రవీణ్‌ మార్పురి.

Advertisement
 
Advertisement
Advertisement