అందుకే తప్పుకున్నా

Amala Paul Opens About ponniyin selvan Movie - Sakshi

మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తీ, ‘జయం’ రవి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న తమిళ  చిత్రం ’పొన్నియిన్‌ సెల్వన్‌’.  ప్రముఖ రచయిత కల్కి కష్ణమూర్తి రచించిన పాపులర్‌ నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో అమలా పాల్‌ కూడా నటించాల్సి ఉంది. కానీ షూటింగ్‌ ప్రారంభం కాకముందే  ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారామె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని తెలిపారామె. ‘మనకి ఆఫర్‌ చేసిన అన్ని సినిమాల్లో నటించలేము.  ’పొన్నియిన్‌ సెల్వన్‌’లోని పాత్రకు నేను సరిపోను అనిపించింది. న్యాయం చేయలేము అనిపించినప్పుడు చేయకపోవడం ఉత్తమం. అందుకే ఆ సినిమా నుంచి బయటకు వచ్చేశాను. మణిరత్నంగారి సినిమాలో నటించే అవకాశం మళ్లీ వస్తుందని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు అమలా పాల్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top