'పెళ్లైన తర్వాత సినిమాలు చేయొద్దన్నాం' | Amala Paul Divorcing Husband. His Dad Blames Her Career | Sakshi
Sakshi News home page

'పెళ్లైన తర్వాత సినిమాలు చేయొద్దన్నాం'

Aug 2 2016 12:31 PM | Updated on Sep 4 2017 7:30 AM

'పెళ్లైన తర్వాత సినిమాలు చేయొద్దన్నాం'

'పెళ్లైన తర్వాత సినిమాలు చేయొద్దన్నాం'

అమలాపాల్, విజయ్ విడాకులు తీసుకుంటున్నట్టు వస్తున్న వార్తలు నిజమేనని అళగప్పన్ చెప్పారు.

దక్షిణాది తార అమలాపాల్ పెళ్లైన రెండేళ్లకే భర్తతో విడాకులకు సిద్ధపడింది. దర్శకుడు ఏఎల్ విజయ్ తో వివాహ బంధం తెంచుకోవాలని 28 ఏళ్ల 'నాయక్' స్టార్ నిర్ణయించింది. విడిపోవడానికి గల కారణాలను ఆమె వెల్లడించలేదు. అత్తింటి వారు పెట్టిన ఆంక్షలు నచ్చకే ఆమె విడాకులు తీసుకోవాలనుకుంటుందట. ఈ విషయాన్ని అమలాపాల్ మామ, నిర్మాత ఏఎల్ అళగప్పన్ స్వయంగా వెల్లడించారు. నటన మానేసి ఆదర్శ భారతనారిగా ఉండాలన్న తమ ఆకాంక్షను ఆమె లెక్కచేయలేదని తమిళ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

'పెళ్లైన తర్వాత కూడా అమల సినిమాలు ఒప్పుకుంది. ఇది విజయ్ కు నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇక సినిమాలు ఒప్పుకోనని చెప్పింది. కానీ ఇప్పుడు పాటలు పాడుతోంది. అంతేకాకుండా సూర్య, ధనుష్ సినిమాల్లో కూడా నటిస్తో్ంది. మా మాట వినకుండా సినిమాలు చేస్తోంది. దీని గురించి ఆమెతో విజయ్ ఏం మాట్లాడాడో మాకు తెలియదు. మా కొడుకు మాకు ముఖ్యం. అమలాపాల్, విజయ్ విడాకులు తీసుకుంటున్నట్టు వస్తున్న వార్తలు నిజమే. న్యాయపరంగా విడిపోతార'ని అళగప్పన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement