అల్లు ఇంట మరో పండగంట? | Allu Arjun's wife Sneha is Pregnant | Sakshi
Sakshi News home page

అల్లు ఇంట మరో పండగంట?

Jul 12 2016 11:38 PM | Updated on Sep 4 2017 4:42 AM

అల్లు ఇంట మరో పండగంట?

అల్లు ఇంట మరో పండగంట?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ దంపతుల ఇంట మరోసారి బోసి నవ్వులు వెల్లివిరియనున్నాయన్నది

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ దంపతుల ఇంట మరోసారి బోసి నవ్వులు వెల్లివిరియనున్నాయన్నది ఫిలిం నగర్ వర్గాల సమాచారం. స్నేహితుల నుంచి ప్రేమికులుగా మారిన అల్లు అర్జున్, స్నేహ తమ పెద్దలను ఒప్పించి ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.
 
2014లో ఈ దంపతులకు కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. బుజ్జిగాడికి ముద్దుగా ‘అయాన్’ అని పేరు పెట్టుకున్నారు. అయాన్ అల్లరి చేష్టలను అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు.
 
బన్నీ, స్నేహ మరోసారి తల్లిదండ్రులు కానున్నారనే వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. భాగ్యనగరంలో జరిగిన హరితహారంలో భార్య, కొడుకుతో పాల్గొన్నారు బన్నీ. అక్కడ స్నేహను చూసినవాళ్లు ప్రెగ్నెంట్ ఏమో అనే సందేహం వెలిబుచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ వార్త నిజమే అని తెలిసింది. ఈసారి.. ఈ దంపతులకు బాబు పుడతాడో? పాప పుడుతుందో చూడాలి.
 

Advertisement
 
Advertisement
Advertisement