ఏఏ 19 : తెర మీదకు మరో టైటిల్‌

Allu Arjun, Trivikram Srinivas Film Titled Venkatapuramlo - Sakshi

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫాదర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కుతుందని అందుకే ఈ సినిమాకు నాన్న నేను అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్టుగా ప్రచారం జరిగింది. తరువాత అలకనంద అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్‌ వినిపించింది.

తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌ తెర మీదక వచ్చింది. ఈ సినిమాకు ‘వెంకటాపురంలో’ అనే పేరును పరిశీలిస్తున్నారట. తన ప్రతీ సినిమా టైటిల్‌ విషయంలో కొత్తగా ఆలోచించే త్రివిక్రమ్‌ ఈ సినిమాకు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. టైటిల్‌ను స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే మరి కొద్ది గంటల్లోనే టైటిల్‌ విషయంలో క్లారిటీ రానుంది.

అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చాలా కాలం తరువాత బాలీవుడ్ నటి టబు ఈ సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top