మహేష్ బాటలో బన్నీ..! | Allu Arjun Too Set To Enter Multiplex Business | Sakshi
Sakshi News home page

Dec 5 2018 4:07 PM | Updated on Dec 5 2018 4:07 PM

Allu Arjun Too Set To Enter Multiplex Business - Sakshi

టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ఇటీవల ఏఎంబీ పేరుతో మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సినిమాల మీదే దృష్టి పెట్టిన మహేష్‌ ఏఎంబీ సినిమాస్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు మరింత మంది తారలు ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే వ్యాపర రంగంలో దూసుకుపోతున్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే సిటీ సెంటర్‌లో ఓ ప్రముఖ థియేటర్‌ ఉన్న స్థలాన్ని మల్టీప్లెక్స్‌ నిర్మాణానికి సెలెక్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై బన్నీ టీం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న బన్నీ త్వరలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement