నార్త్ లోనూ బన్నీ రికార్డ్స్ | allu arjun son of satyamurthy north record | Sakshi
Sakshi News home page

నార్త్ లోనూ బన్నీ రికార్డ్స్

Sep 25 2016 11:51 AM | Updated on Sep 4 2017 2:58 PM

నార్త్ లోనూ బన్నీ రికార్డ్స్

నార్త్ లోనూ బన్నీ రికార్డ్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో మల్లు అర్జున్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బన్నీ నార్త్ ఇండస్ట్రీలోనూ...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో మల్లు అర్జున్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బన్నీ నార్త్ ఇండస్ట్రీలోనూ అదే ఫాంతో దూసుకుపోతున్నాడు. అయితే బన్నీ సినిమాలు థియేటర్లలో భారీగా సందడి చేయకపోయినా.., తాజాగా బన్నీ రికార్డ్స్ స్టైలిష్ స్టార్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ నార్త్లో ఒకేసారి రెండు రికార్డ్స్ను సృష్టించింది. హిందీలోనూ సన్నాఫ్ సత్యమూర్తి పేరుతో యూట్యూబ్లో పెట్టిన ఈ సినిమాకు.., ఇప్పటి వరకు 69 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

అదే సమయంలో గతవారం ఓ టీవీ చానల్లో ప్రసారం అయిన ఈ సినిమా అత్యధిక టీఆర్పీలు సాధించి బుల్లితెర మీద కూడా సత్తా చాటింది. ప్రస్తుతానికి ఆన్లైన్లో స్మాల్ స్క్రీన్లో మాత్రమే కనిపిస్తున్న బన్నీ ఉత్తరాది హవా త్వరలో థియేటర్లలోనూ కనిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement