మాట నిలబెట్టుకున్న బన్నీ | Allu Arjun’s Naa Peru Surya movie launched officially | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్న బన్నీ

Jun 14 2017 11:07 PM | Updated on Sep 5 2017 1:37 PM

మాట నిలబెట్టుకున్న బన్నీ

మాట నిలబెట్టుకున్న బన్నీ

అల్లు అర్జున్‌ మాంచి జోరు మీదున్నారు. ‘రేసు గుర్రం, సన్నాఫ్‌ సత్యమూర్తి, సరైనోడు’.. ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్స్‌ సాధించి, ఈ 23న ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్‌’గా రానున్నారు.

అల్లు అర్జున్‌ మాంచి జోరు మీదున్నారు. ‘రేసు గుర్రం, సన్నాఫ్‌ సత్యమూర్తి, సరైనోడు’.. ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్స్‌ సాధించి, ఈ 23న ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్‌’గా రానున్నారు. అలాగే, కొత్త సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సెట్స్‌లోకి ఎంటర్‌ కావడానికి రెడీ అయిపోయారు. బుధవారం ఈ చిత్రం ప్రారంభమైంది. ‘కిక్, రేసుగుర్రం, టెంపర్‌’ వంటి హిట్‌ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

మెగా బ్రదర్‌ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అర్జున్‌ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, తల్లి నిర్మల క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్‌ అందించారు. నిర్మాత లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘మేం ‘సై్టల్‌’ సినిమా తీసిన టైమ్‌లో మాతో ఓ  సినిమా చేస్తానని అల్లు అర్జున్‌ మాట ఇచ్చారు. ఆ మాట గుర్తు పెట్టుకొని ఈ చిత్రం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

 నాగబాబు, బన్నీవాసు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్‌ ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ. జులైలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెడతాం’’ అన్నారు. ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌ ముఖ్య పాత్రలో, శరత్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్‌ రవి, సంగీతం: విశాల్‌–శేఖర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాబు, సహ నిర్మాత: బన్నీ వాసు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement