‘మహానటి’కి బన్నీ పార్టీ..! | Allu Arjun Party To Mahanati Unit | Sakshi
Sakshi News home page

May 13 2018 10:59 AM | Updated on Mar 22 2019 6:16 PM

Allu Arjun Party To Mahanati Unit - Sakshi

మహానటి టీంపై ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా చిత్రయూనిట్‌కు అభినందలు తెలియజేశారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా మహానటి దర్శక నిర్మాతలు ఇంటికి పిలుపించుకొని మరి అభినందించారు. ఇప్పుడు మహానటి టీం కోసం అల్లు అర్జున్‌ ఓ గ్రాండ్‌ పార్టీ ఇవ్వనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.

ఈ పార్టీకి చిత్రయూనిట్‌తో పాటు పలువురు యువ దర్శకులు కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి తొలి షో నుంచే హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఓవర్‌ సీస్‌లో ఇప్పటికే మిలియన్‌ మార్క్‌ను దాటిన మహానటి మరిన్ని రికార్డుల దిశగడా దూసుకుపోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement