కరోనా ఎఫెక్ట్‌.. ‘పుష్ప’ అప్‌డేట్‌! | Allu Arjun And Sukumar Pushpa Telugu Movie Latest Update | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌.. ‘పుష్ప’ అప్‌డేట్‌!

Jun 20 2020 4:34 PM | Updated on Jun 20 2020 4:45 PM

Allu Arjun And Sukumar Pushpa Telugu Movie Latest Update - Sakshi

రంగస్థలం కోసం ఏ విధంగా చేశారో ఈ సినిమాకు కూడా అలాంటి ప్రయత్నాన్నే చేస్తున్నారు

టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ఫ’. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్ప అనే లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నారు అల్లు అర్జున్‌. ఇప్పటికే విడుదలై టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. షూటింగ్‌లో భాగంగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌ పాల్గొనలేదు. రెండో షెడ్యూల్‌ నుంచి పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో చిత్రీకరణలు ఆగిపోయాయి. (పెళ్లెప్పుడు బాబాయ్‌‌)

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఔట్‌డోర్‌ షూటింగ్‌కు కష్టమని భావించిన చిత్ర బృందం ఓ క్రియేటివ్‌ ఆలోచన చేసింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోనే అడవితో పాటు అడవిలో ఉండే ఓ మారుమూల గ్రామానికి సంబంధించి భారీ సెట్లను నిర్మిస్తున్నారు. గతంలో రంగస్థలం సినిమా కోసం కూడా  పూర్తి సహజసిద్దంగా ఉండే విలేజ్‌ సెట్‌ను సుకుమార్‌ వేయించిన విషయం తెలిసిందే.  ఇప్పుడు అంతే సహజంగా సెట్లను నిర్మించాలని ఆర్ట్‌డైరెక్టర్స్‌ సూచించాడట. అంతేకాకుండా ఈ సెట్స్‌ నిర్మాణం అయ్యేలోపు అతికొద్దిమందితో పాటల చిత్రీకరణ కూడా పూర్తిచేయాలని కూడా సుకుమార్‌ అండ్‌ గ్యాంగ్స్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇక ఇప్పటికే రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ ట్యూన్‌ సిద్దం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ‘పుష్ప’ పాటల చిత్రీకరణ ప్రారంభం కానునుట్ల ఇండస్ట్రీ టాక్‌. దీంతో ఔట్‌డోర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే ‘పుష్ప’ షూటింగ్‌ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తుందట. (‘నీ కన్ను నీలి సముద్రం’.. మరో రికార్డు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement