టాక్సీవాలాది విచిత్రమైన కథ – అల్లు అరవింద్‌ | Allu Aravind Praises Vijay Devarakonda at Taxiwaala Teaser Launch | Sakshi
Sakshi News home page

టాక్సీవాలాది విచిత్రమైన కథ – అల్లు అరవింద్‌

Apr 20 2018 1:43 AM | Updated on Apr 20 2018 1:47 AM

Allu Aravind Praises Vijay Devarakonda at Taxiwaala Teaser Launch - Sakshi

రాహుల్‌ సంక్రితియాన్, మాళవిక నాయర్, ప్రియాంక జవాల్కర్, అల్లు అరవింద్, విజయ్‌ దేవరకొండ, ఎస్‌.కె.ఎన్, మారుతి, ‘బన్ని’ వాసు

‘‘టాక్సీవాలా’ నాకో కొత్త ఎక్స్‌పీరియన్స్‌. విజయ్‌ దేవరకొండ కథ విని ఎగ్జయిట్‌ అయ్యాడు. ఎస్‌.కె.ఎన్‌ నిర్మాతగా విజయ్‌ దేవరకొండతో ఈ సినిమా చేశాడు. నిర్మాతగా తనకు మంచి భవిష్యత్‌ ఉండాలి. విచిత్రమైన సబ్జెక్ట్‌ ఇది. కొత్తగా ఉంటుంది. విజయ్‌ దేవరకొండ జెన్యూన్‌ ఆర్టిస్ట్‌. తనకు గొప్ప భవిష్యత్‌ ఉంటుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా, మాళవికా నాయర్, ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్స్‌గా రాహుల్‌ సంక్రితియాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’.

జిఏ 2, యూవీ పిక్చర్స్‌పై ఎస్‌.కె.ఎన్‌ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ది ఎండ్‌’  తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న చిత్రమిది. ఎక్కడా తగ్గకుండా సినిమాను కంప్లీట్‌ చేశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. గ్రాఫిక్స్‌ పనులు జరుగుతున్నాయి. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు రాహుల్‌ సంక్రితియాన్‌. ‘‘ఒకప్పుడు గీతా ఆర్ట్స్‌లో వచ్చిన చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గారి సినిమాలకు బ్యానర్స్‌ కట్టేవాణ్ణి. ఇప్పుడు ఆ బ్యానర్‌లో నిర్మాతగా నా పేరు రావడం గొప్ప విషయంగా భావిస్తున్నా’’ అన్నారు ఎస్‌.కె.ఎన్‌.

‘‘మంచి టాలెంట్, సినిమాపై ప్యాషన్‌ ఉన్నవారి కోసం అల్లు అరవింద్‌గారి ఆశీర్వాదంతో జీఏ2 స్టార్ట్‌ చేశాం. ‘టాక్సీవాలా’ జర్నీలో యు.వి.క్రియేషన్స్‌ వారు నాకు సపోర్ట్‌ ఇచ్చారు’’ అన్నారు నిర్మాత ‘బన్ని’ వాసు. ‘‘మే 18న మా సినిమా విడుదలవుతుంది. సినిమా చూసి అందరూ పడి పడినవ్వుకుంటారు’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. ‘‘ఓ మంచి చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు కథానాయికలు మాళవికా నాయర్, ప్రియాంక జవాల్కర్‌.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement