మహేష్తో సినిమాపై యువ హీరో..! | allari naresh about movie with mahesh babu | Sakshi
Sakshi News home page

మహేష్తో సినిమాపై యువ హీరో..!

Jun 30 2017 2:55 PM | Updated on Sep 5 2017 2:52 PM

ప్రస్తుతం తన 23వ సినిమాగా తెరకెక్కుతున్న స్పైడర్ తో పాటు 24వ సినిమా భరత్ అను నేను షూటింగ్ లలో బిజీగా ఉన్న

ప్రస్తుతం తన 23వ సినిమాగా తెరకెక్కుతున్న స్పైడర్ తో పాటు 24వ సినిమా భరత్ అను నేను షూటింగ్ లలో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనిదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాను తన 25వ సినిమాగా చేయనున్నాడు మహేష్. అంతేకాదు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో స్టార్ ఇమేజ్ ఉన్న నటుణ్ని తీసుకోవాలని భావిస్తున్నారు.

ఇప్పటికే ఆ పాత్రకు అల్లరి నరేష్ ను సంప్రదించారన్న టాక్ వినిపించగా నరేష్ కూడా ఆ వార్తలను ధృవీకరించాడు. మహేష్ బాబు సినిమా కోసం నన్ను సంప్రదించిన మాట నిజమే, అయితే ఆ సినిమాలో చేస్తున్నది లేనిది ఇంకా నిర్ణయించుకోలేదు. నా అభిప్రాయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు నరేష్. ప్రస్తుతం నరేష్ హీరోగా తెరకెక్కిన మేడ మీద అబ్బాయి నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement