'ధూమ్ 4'లో అల్లు అర్జున్ | all arjun bollywood Movie title dhoom 4 | Sakshi
Sakshi News home page

'ధూమ్ 4'లో అల్లు అర్జున్

Jan 21 2016 1:57 PM | Updated on Apr 8 2019 8:07 PM

'ధూమ్ 4'లో అల్లు అర్జున్ - Sakshi

'ధూమ్ 4'లో అల్లు అర్జున్

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ధూమ్ 4తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. బన్నీ హీరోగా నటించిన ధూమ్ 4 త్వరలోనే బాలీవుడ్లో రిలీజ్కు రెడీ...

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ధూమ్ 4తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. బన్నీ హీరోగా నటించిన ధూమ్ 4 త్వరలోనే బాలీవుడ్లో రిలీజ్కు రెడీ అవుతోంది. అదేంటి ధూమ్ 4 సినిమాలో బన్నీనా..? అది కూడా అప్పుడే రిలీజ్కు రెడీ అయ్యిందా...? అని ఆశ్చర్యపోకండి. అక్కడే ఉంది అసలు కథ. అల్లు అర్జున్ హీరోగా నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా రేసుగుర్రం, ధూమ్ 4 పేరుతో హిందీలో రిలీజ్ అవుతోంది.

తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయి, సక్సెస్ సాధించిన సందర్భాలు చాలా అరుదు. అయితే ఈసారి మాత్రం బన్నీ.., ధూమ్ టైటిల్తో మంచి పబ్లిసిటీనే సాధించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. శృతితో పాటు విలన్గా నటించిన రవికిషన్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస్లు నార్త్ ప్రేక్షకులకు సుపరిచితులు కావటంతో రేసుగుర్రం అక్కడ కూడా మంచి వసూళ్లనే రాబడుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement