వారిద్దరూ మళ్లీ కలిసి నటిస్తున్నారా? | Alia, Varun to reunite for 'Humpty Sharma Ki Dulhaniya' sequel? | Sakshi
Sakshi News home page

వారిద్దరూ మళ్లీ కలిసి నటిస్తున్నారా?

May 2 2016 5:15 PM | Updated on Sep 3 2017 11:16 PM

వారిద్దరూ మళ్లీ కలిసి నటిస్తున్నారా?

వారిద్దరూ మళ్లీ కలిసి నటిస్తున్నారా?

బాలీవుడ్ హిట్ పెయిర్ అలియా భట్, వరుణ్ ధావన్ మరోసారి జతకడుతున్నారా?

ముంబై: హిట్ పెయిర్ అలియా భట్, వరుణ్ ధావన్ మరోసారి జతకడుతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఈ విషయాన్ని స్వయంగా అలియా భట్ ట్విట్టర్ ద్వారా హింట్ ఇచ్చింది. 2014లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'హంప్టీ శర్మ కి దుల్హనియా' చిత్ర సీక్వెల్లో వీరు కలిసినటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను అలియా ట్విట్టర్లో పోస్ట్ పోస్ట్ చేసింది. వరుణ్, అలియా వెనక్కి తిరిగి ఉన్న ఆ ఫోటోపై 'ఆర్ దే కమింగ్ బ్యాక్' అని ఉన్న క్యాప్షన్ అభిమానుల్లో హాట్ టాపిక్ అయింది.

హంప్టీ శర్మ కి దుల్హానియా చిత్రం అప్పట్లో బారీ హిట్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దానికి సీక్వెల్గా వస్తున్న చిత్రంలో మరోసారి అదే జంట కలిసి నటిస్తున్నారనే వార్త ఇప్పుడు బాలీవుడ్లో ఆసక్తి కలిగిస్తోంది. వరుణ్ ధావన్ సైతం  అదే ఫోటోతో ట్వీట్టర్లో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సైతం ఈ సస్పెన్స్ను కంటిన్యూ చేస్తూ ధర్మా ప్రొడక్షన్స్ అఫిసియల్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పేర్కొన్నాడు. అయితే ఈ విషయంలో మరింత సర్ప్రైజ్ కోసం కొంచెం వెయిట్  చేయాలంటున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement