కంగనాకు పూలగుచ్ఛం పంపిన అలియా భట్‌!

Alia Bhatt Sends Flowers To Kangana Ranaut For Winning Padma Award - Sakshi

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ నటించిన ‘క్వీన్‌’ సినిమాకు గాను ఈ ఏడాది పద్మశ్రీ ఆవార్డుకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో కంగనాకు సన్నిహితులు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ కూడా కంగనకు పూల గుచ్ఛాన్ని పంపించి అభినందనలు తెలపడం విశేషం. ఈ విషయాన్ని కంగన సోదరి రంగోలి చందేల్ ట్విటర్‌లో తెలిపారు. అలియా పంపిన పూల బొకె  ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‌‘చూడండి! అలియా కూడా  పువ్వులు పంపించారు. కంగనా గురించి నాకు తెలియదు కానీ.. నేను నిజంగా ఆనందిస్తున్నాను’ అంటూ రంగోలి ట్వీట్‌ చేశారు.

కాగా గతంలో కంగనా, అలియా భట్‌ను పలు సందర్భాల్లో విమర్శించిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్యూలో ‘అలియా, కరణ్‌ జోహార్‌ తోలు బొమ్మగా కాకుండా తన సోంత స్వరాన్ని కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ తనదైన శైలిలో విమర్శించారు. అదేవిధంగా ‘గల్లిభాయ్‌లో అలీయా నటన సాధారణంగా ఉంది. ఇక అలియాను నాకు పోటీ అని భావించినందుకు ఇబ్బందిగా ఫీల్‌ అయ్యాను’ అంటూ అలియాను ఏకిపారేశారు. అయితే కంగనా వ్యాఖ్యాలకు అలియా తిరిగి స్పందించలేదు. రంగోలి ‘ప్రజలు తెలివి తక్కువ వాళ్లు కాదు. ఈ పరిశ్రమలో ఎవరూ ఒంటరిగా పోరాడుతున్నారో, తెర వెనుక జరిగే రాజకీయ కుట్రలు వారికి తెలుసు. ఈ సమయంలో నిజాయితీ, పారదర్శకత చాలా విలువైనవి కాబట్టి నేను నిశబ్దంగా ఉంటున్నా. మీ పరిధిలో మీరుండండి’ అంటూ రంగోలి, అలియా నిశ్భబ్థంపై చురకలు అంటించారు.

కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 71వ పద్మ అవార్డులను ప్రకటించింది. హిందీ చిత్రసీమకు నాలుగు పద్మా ఆవార్డులు వరించాయి. ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్, టీవీ టైకూన్‌ ఏక్తా కపూర్, ప్రముఖ కథానాయిక కంగనా రనౌత్, ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సామీలను ‘పద్మశ్రీ’ వరించింది. అయితే అవార్డుల జాబితాలో తెలుగు చిత్రసీమకు సంబంధించిన వారెవరూ లేకపోవడం గమనార్హం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top