నకిలీ ఆహ్వానం | Sakshi
Sakshi News home page

నకిలీ ఆహ్వానం

Published Wed, Oct 23 2019 2:28 AM

 Alia Bhatt And Ranbir Kapoor Fake Wedding Invitation Card Viral On Internet - Sakshi

బాలీవుడ్‌  క్రేజీ లవ్‌బర్డ్స్‌ రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ల నిశ్చితార్థం వచ్చే ఏడాది జనవరి 22న జోథ్‌పూర్‌లో జరుగుతుందన్నట్లు ఓ ఆహ్వాన పత్రిక నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. కానీ నెట్టింట్లో ఉన్న ఆహ్వానపత్రిక నిజమైనది కాదట. అందులో ‘ఆలియా’ స్పెల్లింగ్‌ తప్పుగా ఉండటంతో పాటు ఆలియా తండ్రి పేరు ముఖేష్‌ భట్‌ (నిజానికి ఆలియాభట్‌ తండ్రి పేరు మహేశ్‌భట్‌) అని ఉంది. ఈ కారణాలతో అది నకిలీ ఆహ్వానపత్రిక అని తెల్చేశాయి బాలీవుడ్‌ వర్గాలు.

మరోవైపు ఈ విషయం గురించి ముంబై  విమానాశ్రయంలో తారసపడిన ఆలియాను మీడియా అడిగితే.. ‘‘నేనేం చెప్పగలను. ఆ ఆహ్వాన పత్రిక ఫేక్‌’’ అని బదులిచ్చారట. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఆలియా తన ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌తో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా చేస్తున్నారు. నెట్టింట్లో చక్కర్లు కొట్టిన ఆహ్వాన పత్రిక నకిలీదే అయ్యుండొచ్చు కానీ రణ్‌బీర్, ఆలియా ప్రేమలో ఉన్నారన్నది మాత్రం నిజం. మరి.. పెళ్లెప్పుడు? అంటే.. ఇద్దరూ నవ్వేసి, సమాధానం చెప్పకుండా తెలివిగా తప్పించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement