Sittharala Sirapadu Video Song Lyrical Relased | Ala Vaikunthapurramloo Climax Fight Song - Sakshi Telugu
Sakshi News home page

‘అల’ నుంచి ‘సిత్తరాల సిరిపడు’

Jan 17 2020 10:54 AM | Updated on Jan 17 2020 3:01 PM

Ala Vaikunthapurramuloo: Sittharala Sirapadu Lyrical Song Out - Sakshi

‘అల’ నుంచి బన్ని ఫ్యాన్స్‌కు ‘సిత్తరాల సిరిపడు’ కానుక

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు కరెక్ట్‌ సినిమా పడితే ఫలితం ఎలా ఉంటుందో ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో తెలిసిపోయింది.  అగ్నికి వాయువు తోడైనట్టు బన్నికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ జతకడితే ఆ చిత్రం మరో ఆణిముత్యంగా మిగలడం పక్కా అని మరోసారి రుజువైంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు హిట్‌ సాధించాయి. కాగా ముచ్చటగా మూడో సారి జతకట్టిన ఈ ద్వయం హ్యాట్రిక్‌ సాధించి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తోంది. సంక్రాంతి కానుకగా ఆదివారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో కనివిని ఎరుగని రీతిలో వసూ​ళ్లు రాబడుతోంది. దీంతో బన్ని-త్రివిక్రమ్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. 

ఇదే తరుణంలో ‘అల.. వైకుంఠపుమరములో’ సినిమా ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్‌ మరో కానుక అందించింది. ఈ చిత్రంలోని ‘సిత్తరాల సిరిపడు’ పాట ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఆడియోలో దాచిపెట్టిన ఈ సాంగ్‌ థియేటర్‌లో ఈలలు వేయించింది. ఈ పాటను ఫైట్‌గా తీసి గొప్ప ప్రయోగం చేశారు దర్శకుడు. తాజాగా ‘సిత్తరాల సిరిపడు’ సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. థియేటర్‌లో దుమ్ముదులిపిన ఈ పాట నెట్టింట్లో కూడా వైరల్‌ అవుతోంది. మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిన ‘ఆల.. వైకుంఠపురములో’ ఆల్బమ్‌లోకి కలికితురాయిగా ఈ సాంగ్‌ వచ్చి చేరిందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఈ పాటను శ్రీకాకుళంకు చెందిన విజయ్‌కుమార్‌ రచించగా.. సూరన్న, సాకేత్‌లు పాడారు. తమన్‌ కంపోజ్‌ చేశాడు. ఇక ఈ పాటకు తమన్‌ అర్థగంటలో ట్యూన్‌ కట్టాడని.. ఫోన్‌లోనే విజయ్‌కుమార్‌ లిరిక్స్‌ అందించాడని తివ్రిక్రమ్‌ తెలిపాడు. శ్రీకాకుళం యాసలో సాగిన ఈ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితమిస్తున్నట్లు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి బరిలోకి దిగి ఘన విజయం అందుకున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటించారు. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ(చినబాబు) లు సంయుక్తంగా నిర్మించారు. టబు, సుశాంత్‌, నివేదా పేతురాజు, జయరాం, సముద్రఖని, సచిన్‌, సునీల్‌, నవదీప్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి వినోద్‌ సినిమాటోగ్రఫీ అందించాడు. 

చదవండి: 
‘అల.. వైకుంఠపురములో’ మూవీ రివ్యూ
కంగ్రాట్స్‌ బావా.., స్వామి.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement