అల వసూళ్లు ఇలా..

Ala Vaikunthapurramuloo Box Office Collection Crosses Rs Hundred Crore Mark - Sakshi

హైదరాబాద్‌ : స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో సంక్రాంతి ఫీస్ట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అల వైకుంఠపురంలో రికార్డు వసూళ్లను రాబడుతూ దూసుకెళుతోంది. మూడు రోజుల్లోనే రూ 98 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన మూవీ బుధవారం మార్నింగ్, మ్యాట్నీ షోలతో రూ 100 కోట్ల గ్రాస్‌ను దాటేసింది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా దర్బార్‌, సరిలేరు నీకెవ్వరు మూవీలతో తలపడుతూ దీటైన వసూళ్లను రాబడుతోంది. మంగళ, బుధవారాల్లో సైతం అల వైకుంఠపురంలో నూరు శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచిందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. అల వైకుంఠపురం గ్లోబల్‌ థియేట్రికల్‌ హక్కులు రూ 85 కోట్లకు అమ్ముడుపోగా మూడు రోజులకే రూ 61.03 కోట్ల షేర్‌ రాబట్టింది. ఇక రూ 23.97 కోట్లు రాబడితే మూవీ బ్రేక్‌ ఈవెన్‌ సాధించనుండగా మరో రెండ్రోజుల్లోనే ఈ ఫీట్‌ను సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top