ఎట్టకేలకు అక్షయ్‌ సినిమా పూర్తైయింది!

Akshay Kumar Housefull 4 Shooting Completed - Sakshi

అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన హౌస్‌ఫుల్‌4 చిత్రం షూటింగ్‌ పూర్తైయింది. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్‌ సోషల్‌ మీడియాద్వారా ప్రకటించేశాడు. బాలీవుడ్‌లో చెలరేగిన మీటూ మంటలతో ఈ సినిమాపై గందరగోళం నెలకొంది. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన నానా పటేకర్‌, దర్శకుడు సాజిద్‌ నదియావాలాపై మీటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ ఆరోపణలు రోజురోజుకి పెరిగిపోతుండటంతో.. చిత్రయూనిట్‌ వీరిద్దరిని హౌస్‌ఫుల్‌4 నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. బాలీవుడ్‌లో మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తమ చిత్రాల్లోంచి బహిష్కరించడం మొదలుపెట్టారు మేకర్స్‌. అయితే నానా పటేకర్‌ స్థానంలో రానా దగ్గుబాటిని తీసుకున్నారు. అయితే సాజిద్‌ నదియావాలాను బహిష్కరించినట్లు ప్రకటించినా.. మిగిలిన భాగాన్ని కూడా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రితేష్‌ దేశ్‌ముఖ్‌, కృతి సనన్‌, కృతి కుర్బంధ, పూజా హెగ్డేలు నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top