రోబో 2.0లో నేను కాకినా? | Akshay Kumar 'glad' to be the villain in Robot 2 | Sakshi
Sakshi News home page

రోబో 2.0లో నేను కాకినా?

Jul 21 2016 11:37 PM | Updated on Sep 4 2017 5:41 AM

రోబో 2.0లో నేను కాకినా?

రోబో 2.0లో నేను కాకినా?

ఇప్పటివరకూ హిందీ చిత్రాల్లో హీరోగా విలన్లను రఫ్ఫాడించిన అక్షయ్‌కుమార్ ఇప్పుడు తానే విలన్ అయిపోయారు.

ఇప్పటివరకూ హిందీ చిత్రాల్లో హీరోగా విలన్లను రఫ్ఫాడించిన అక్షయ్‌కుమార్ ఇప్పుడు తానే విలన్ అయిపోయారు. రజనీకాంత్ ఇచ్చే పంచ్‌లను ఆనందంగా స్వీకరిస్తున్నారు. ‘రోబో’కి సీక్వెల్‌గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రోబో 2.0’లో అక్షయ్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ కాంబినేషన్‌లో నటించడం ఆనందంగా ఉందని అక్షయ్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఆయన కాకిగా మారే పిచ్చి శాస్త్రవేత్తగా కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది.
 
  కాకి గెటప్‌లో ఓ ఫొటో కూడా బయటి కొచ్చింది. ‘‘నేను పిచ్చి సైంటిస్ట్‌నా? కాకినా? ఇది నాకు కొత్త న్యూస్. ఎవరేమైనా ఊహించుకోండి. అందరి ఊహలకు భిన్నంగా కనిపిస్తా’’ అని అక్షయ్ అన్నారు. ఈ చిత్రంలో ఆయన మేకప్‌కే ఆరు గంటలు పట్టిందట. విచిత్రంగా కనిపిస్తారనే టాక్ కూడా ఉంది. ఇదే విషయాన్ని అక్షయ్ ముందుంచితే - ‘‘ఇప్పుడా వివరాలేవీ చెప్పను. ఒకే ఒక్క విషయం చెబుతాను.
 
 ఈ మధ్య నేనో హోటల్‌కెళ్లాను. మేకప్ వేసుకునే వెళ్లాను. ఎవరూ నన్ను విచిత్రంగా చూడలేదు. అంటే చూడ్డాని కి విచిత్రంగా లేననే కదా అర్థం. ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు కూడా. దాంతో హాయిగా ఫుడ్‌ని ఎంజాయ్ చేశాను’’ అన్నారు. గెటప్ విచిత్రంగా ఉండదంటున్నారు.. ఎవరూ గుర్తుపట్టలేదంటున్నారు. మరి.. ‘రోబో 2.0’లో అక్షయ్ ఎలా కనిపిస్తారో చూడాలి.
 

Advertisement
 
Advertisement
Advertisement